Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 16 Feb 2024 21:01 IST

1. పొత్తులకు సహకరించిన నేతలకు అధికారంలోకి రాగానే ప్రాధాన్యం: చంద్రబాబు

పొత్తులు ఉన్నందున టికెట్‌ రాలేదని ఎవరూ నిరుత్సాహపడొద్దని పార్టీ నేతలకు తెదేపా అధినేత చంద్రబాబు సూచించారు. పొత్తులకు సహకరించిన వారికి అధికారంలోకి రాగానే ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు.  పార్టీని నమ్ముకున్న వారికి కచ్చితంగా గుర్తింపు, ప్రాధాన్యం ఉంటుందని వివరించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. జగన్ అవినీతి స్టార్.. ఏ స్కీమ్ తీసుకొచ్చిన స్కామే: నారా లోకేశ్‌

సీఎం జగన్ ఒక ప్యాలెస్ పిల్లి అని.. రాజధాని పేరుతో ఆయన ఎన్ని జే టర్న్‌లు తీసుకున్నారో అందరికీ తెలుసని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. విజయనగరం నియోజకవర్గం శంఖారావం సభలో ఆయన మాట్లాడారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రెచ్చిపోయిన ఎంపీ అనుచరులు.. తెదేపా శ్రేణులు రాకుండా అడ్డగింత

అధికారమే అండగా వైకాపా నేతలు రెచ్చిపోతున్నారు. ఇతర పార్టీల ప్రచార కార్యక్రమాలను అడ్డుకునే స్థాయికి బరి తెగించారు. తాజాగా బాపట్ల జిల్లా నిజాంపట్నంలో వైకాపా రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ అనుచరులు వీరంగం వేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఏపీ పోలీసులు.. కండువా లేని వైకాపా కార్యకర్తలు: వైఎస్‌ షర్మిల

సత్తెనపల్లిలో యూత్‌కాంగ్రెస్‌ నాయకులపై పోలీసులు, వైకాపా గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. పోలీసులు ఉన్నది ప్రజల కోసమా? లేక అధికార పార్టీ అడుగులకు మడుగులు ఒత్తడం కోసమా? అని ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా ప్రశ్నించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. శివబాలకృష్ణ కేసులో కీలక పరిణామం..

రెరా మాజీ డైరెక్టర్‌ శివ బాలకృష్ణ కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. తాజాగా శ్రీకృష్ణ స్థిరాస్తి సంస్థలో ఫ్లాట్‌ కొనుగోలుకు బాలకృష్ణ చెల్లించిన రూ.2.70 కోట్లను సీజ్‌ చేశారు. కొన్ని నెలల క్రితమే ఈ మొత్తాన్ని చెల్లించినట్టు గుర్తించారు. ఇంకా ఏయే సంస్థల్లో పెట్టుబడులు పెట్టాడనే అంశాంపై కూపీ లాగుతున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. తెలంగాణ ఫైనాన్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా సిరిసిల్ల రాజయ్య

రాష్ట్ర ఫైనాన్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను ప్రభుత్వం నియమించింది. కమిషన్‌ సభ్యులుగా ఎం.రమేశ్‌, సంకేపల్లి సుధీర్‌రెడ్డి, నెహ్రూ నాయక్‌ మాలోత్‌ను నియమిస్తూ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా రెండేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కులగణన తీర్మానానికి తెలంగాణ శానససభ ఆమోదం

కులగణన తీర్మానానికి తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో సమగ్ర కులగణన, సామాజిక, ఆర్థిక ఇంటింటి సర్వేకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. భారాస ఎమ్మెల్యే కేటీఆర్‌ మాట్లాడుతూ.. చట్టబద్ధత ఉంటేనే ఈ కార్యక్రమం ఫలవంతమవుతుందన్నారు. న్యాయ విచారణ కమిషన్‌ వేయాలని, బిల్లు కోసం అసెంబ్లీ సమావేశాలు పొడిగించాలని కోరారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విడిగానే విచారణ: సుప్రీంకోర్టు

దర్యాప్తు సంస్థలు మహిళలను ఇంట్లోనే విచారించాలనే అంశంపై భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 28కి వాయిదా వేసింది. మద్యం కేసులో విచారణకు రావాలని ఈడీ జారీ చేసిన నోటీసులను గతేడాది  కవిత సవాలు చేశారు. గతంలో ఆమె పిటిషన్‌ను నళినీ చిదంబరం, అభిషేక్ బెనర్జీ కేసులతో జత చేసిన విషయం తెలిసిందే.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు మరో 15 రోజులు గడువు

పేటీఎం పేమెంట్‌ బ్యాంక్‌ (PPBL)కి  భారతీయ రిజర్వు బ్యాంక్‌ (RBI) మరో 15 రోజులు గడువు ఇచ్చింది. జనవరి 31న పేటీఎంపై ఆంక్షలు విధిస్తూ ఆర్‌బీఐ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 29 తర్వాత కస్టమర్ల ఖాతాలు, వ్యాలెట్లు, ఫాస్టాగ్‌లలో డిపాజిట్లు, టాప్‌-అప్‌లు స్వీకరించొద్దని ఆదేశాల్లో పేర్కొంది. తాజాగా ఈ గడువును మార్చి 15 వరకు పొడిగించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. రూ.115 కోట్లు ఫ్రీజ్‌.. అసలు అంత సొమ్మే లేదుగా..!

ఐటీ విభాగం చర్యలతో కాంగ్రెస్ పార్టీ(Congress) బ్యాంకు ఖాతాలు కొద్దిసేపు ఫ్రీజ్‌ అయిన సంగతి తెలిసిందే. దీనిపై హస్తం పార్టీ చట్టపరంగా చర్యలు తీసుకుంది. దాంతో ఆ ఖాతాలను ఐటీ విభాగం అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ పునరుద్ధరించింది. ఈ వ్యవహారంపై వచ్చేవారం విచారణ జరిగేవరకు తాత్కాలిక ఊరట కొనసాగనుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని