YS Sharmila: ఏపీ పోలీసులు.. కండువా లేని వైకాపా కార్యకర్తలు: వైఎస్‌ షర్మిల

సత్తెనపల్లిలో యూత్‌కాంగ్రెస్‌ నాయకులపై పోలీసులు, వైకాపా గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. 

Published : 16 Feb 2024 19:48 IST

అమరావతి: సత్తెనపల్లిలో యూత్‌కాంగ్రెస్‌ నాయకులపై పోలీసులు, వైకాపా గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. పోలీసులు ఉన్నది ప్రజల కోసమా? లేక అధికార పార్టీ అడుగులకు మడుగులు ఒత్తడం కోసమా? అని ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా ప్రశ్నించారు. ‘‘ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలిపితే బూట్లతో తొక్కిస్తారా? గొంతు పిసికి చంపాలని చూస్తారా? వైకాపా గూండాలను పక్కన పెట్టి మరీ దాడులు చేయిస్తారా? మీరు పోలీసులా లేక వైకాపా కిరాయి మనుషులా? ఇష్టారాజ్యంగా కొట్టడానికి ఎవరిచ్చారు హక్కు? కండువా లేని వైకాపా కార్యకర్తలు మన పోలీసులు. సత్తెనపల్లి ఘటనపై డీజీపీ వెంటనే స్పందించాలి. విచక్షణారహితంగా కొట్టిన పోలీసు సిబ్బందిని వెంటనే సస్పెండ్‌ చేయాలి’’ అని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని