TTD: ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని తితిదే నిర్ణయం

తమ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని తితిదే నిర్ణయించింది. ఈ మేరకు తితిదే ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

Updated : 26 Dec 2023 15:36 IST

తిరుమల: తమ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని తితిదే నిర్ణయించింది. ఈ మేరకు తితిదే ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పీస్‌ రేట్‌ క్షురకుల కనీస వేతనం రూ.20 వేలకు పెంపు ప్రతిపాదనకు మండలి ఆమోదం తెలిపింది. వీటితోపాటు లడ్డూ పోటులోని కార్మికులకు అదనంగా రూ.10వేల వేతనం పెంచేందుకు అంగీకరించింది. ఈ సమావేశం సందర్భంగా గోవింద నామకోటి పుస్తకాలను తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి విడుదల చేశారు. 5 భాషల్లో ముద్రించిన భగవద్గీత పుస్తకాలను ఆవిష్కరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని