Cyclone Asani: అసని ఎఫెక్ట్‌.. విశాఖ, విజయవాడ విమాన సర్వీసులు రద్దు

అసని తుపాను ప్రభావంతో విశాఖకు విమాన రాకపోకలు రెండో రోజైన ఇవాళ కూడా రద్దయ్యాయి. విశాఖ నుంచి అన్ని ఇండిగో సర్వీసులను రద్దు చేశారు.

Updated : 11 May 2022 10:27 IST

విజయవాడ: అసని తుపాను ప్రభావంతో విశాఖకు విమాన రాకపోకలు రెండో రోజైన ఇవాళ కూడా రద్దయ్యాయి. విశాఖ నుంచి అన్ని ఇండిగో సర్వీసులను రద్దు చేశారు. మొత్తం 22 సర్వీసుల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు ఇండిగో సంస్థ ప్రకటించింది. బెంగళూరు, దిల్లీ నుంచి రెండు విమాన సర్వీసులను ఎయిర్‌ ఏషియా రద్దు చేసింది. తుపాను దృష్ట్యా ఎయిరిండియా విమన సర్వీసులు కూడా రద్దు చేశారు. స్పైస్‌జెట్‌ విమాన సర్వీసులను ఈ ఉదయం రద్దు చేసినట్లు ఆ సంస్థ తెలిపింది. మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్‌ సర్వీసుపై తర్వాత ప్రకటిస్తామని స్పైస్‌జెట్‌ ప్రకటించింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని విశాఖ ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు.

మరోవైపు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు సర్వీసులను రద్దు చేశారు. బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై ప్రధాన సర్వీసులను రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది. దీంతో పాటు విశాఖ, రాజమహేంద్రవరం, కడపకు నడిచే లింకు సర్వీసును నిలుపుదల చేశారు. వాతావరణ మార్పుల అనంతరం సర్వీసును పునరుద్ధరిస్తామని ఇండిగో తెలిపింది. రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి అన్ని విమాన సర్వీసులను రద్దు చేశారు. హైదరాబాద్, బెంగళూరు, విశాఖ నుంచి తొమ్మిది విమానాలు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని