109 మంది పోలీసులకు గాయాలు 

కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ రైతులు చేపట్టిన గణతంత్ర పరేడ్‌లో 109 మంది పోలీసులు గాయపడ్డట్లు అధికారులు తెలిపారు. ట్రాక్టర్ల పరేడ్‌లో భాగంగా నిర్దేశిత రూట్‌లో...

Updated : 26 Jan 2021 23:26 IST

దిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ రైతులు చేపట్టిన గణతంత్ర పరేడ్‌లో 109 మంది పోలీసులు గాయపడ్డట్లు అధికారులు తెలిపారు. ట్రాక్టర్ల పరేడ్‌లో భాగంగా నిర్దేశిత రూట్‌లో కాకుండా ఆందోళనకారులు ఎర్రకోటను చుట్టుముట్టడంతో వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పలువురు పోలీసులు కోట గోడలపై నుంచి కింద పడడంతో  పలువురికి గాయాలు అయ్యాయి. భద్రతా బలగాల్లో ఎక్కువగా దిల్లీ పోలీసులు గాయపడ్డారు. దీంతో దిల్లీ పోలీసులు పలువురు ఆందోళనకారులపై 4 కేసులు నమోదు చేశారు. వీటిలో మూడు తూర్పు దిల్లీ స్టేషన్‌లో కేసులు నమోదు చేయగా, ఒకటి సహదర స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

మరోవైపు ఆందోళనకారులు ఎర్రకోటపై ఎగరేసిన జెండాలను పోలీసులు తొలగించారు. ఎర్రకోట పరిసరాల నుంచి ఆందోళనకారులంతా వెళ్లిపోయారని నిర్ధారణ అయిన తర్వాతే పోలీసులు జెండాలను తొలగించారు. గణతంత్ర వేడుకల అనంతరం ఆందోళనకారులు ఒక్కసారిగా ఎర్రకోటపైకి దూసుకురావడంతో 300 మంది కళాకారులు కోటలో దాక్కున్నారు. వారిని పోలీసులు సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. ఈ ఘటనపై పోలీసులు మరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 

ఇవీ చదవండి..
పంజాబ్‌, హరియాణాల్లో హై అలర్ట్‌ 
ర్యాలీలోకి ఇతరులు చొరబడ్డారు: తికాయత్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని