బంగారు కోడిపెట్ట!

కోడిపెట్ట రోజుకు ఒక గుడ్డు పెడుతుంది. అప్పుడప్పుడు రెండు పెడుతుంది.

Updated : 28 Jun 2021 23:16 IST

కోడిపెట్ట రోజుకు ఒక గుడ్డు పెడుతుంది. అప్పుడప్పుడు రెండు పెడుతుంది. కేరళ రాష్ట్రం కోజికోడ్‌లోని బాలుస్సెరీలో ఓ కోడిపెట్ట ఒకేరోజులో ఏకంగా 11 గుడ్లు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. కొలత్తూరుకు చెందిన మనోజ్‌ అనే వ్యక్తి ఇంట్లో గత గురువారం ఈ విచిత్రం జరిగింది. ఉదయం ఏడింటి నుంచి మధ్యాహ్నం ఒంటిగంట మధ్య అర గంటకోసారి గుడ్డు పెట్టినట్లు మనోజ్‌ తెలిపారు. నాలుగు నెలల కిందట బంధువుల ఇంటి నుంచి ఈ కోడిని తెచ్చుకున్నట్లు వెల్లడించారు. హార్మోన్ల ప్రభావం వల్లే కోడిపెట్ట అన్ని గుడ్లు పెట్టి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని