ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌నకు ఆరేళ్ల బాలుడు

హిమాచల్‌ప్రదేశ్‌లోని బిలాస్‌పుర్‌కు చెందిన ఆరేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్‌ శిఖరం బేస్‌ క్యాంప్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. బిలాస్‌పుర్‌ జిల్లాలోని జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్‌ తల్లిదండ్రులతో కలిసి దుబాయ్‌లో ఉంటున్నాడు.

Published : 27 Apr 2024 06:08 IST

హిమాచల్‌కు చెందిన యువన్‌ ఘనత

ఈటీవీ భారత్‌: హిమాచల్‌ప్రదేశ్‌లోని బిలాస్‌పుర్‌కు చెందిన ఆరేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్‌ శిఖరం బేస్‌ క్యాంప్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. బిలాస్‌పుర్‌ జిల్లాలోని జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్‌ తల్లిదండ్రులతో కలిసి దుబాయ్‌లో ఉంటున్నాడు. యువన్‌ మొదటి తరగతి చదువుతున్నాడు. ట్రెక్కింగ్‌ కోసం ఆరు నెలల పాటు కఠిన శిక్షణ తీసుకున్నాడు. స్విమ్మింగ్‌, మార్షల్‌ ఆర్ట్స్‌, రన్నింగ్‌లో కూడా ప్రావీణ్యం పొందాడు. ‘‘గైడ్‌ సహాయంతో ఏప్రిల్‌ 8వ తేదీన ట్రెక్కింగ్‌ ప్రారంభించాం. 11 రోజుల్లో ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌నకు చేరుకున్నాం. 8 రోజులు ట్రెక్కింగ్‌ చేశాం. గైడ్‌ సలహా మేరకు రెండు రోజులు విశ్రాంతి తీసుకున్నాం’’ అని యువన్‌ తండ్రి సుభాశ్‌ చంద్ర తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని