Parliament: బడ్జెట్‌ సమావేశాలు.. అఖిలపక్ష భేటీకి కేంద్రం పిలుపు

పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల (Budget session) నేపథ్యంలో జనవరి 30న అఖిలపక్ష సమావేశం (All-party Meet) ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.

Published : 29 Jan 2024 18:04 IST

దిల్లీ: పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు (Budget session) జనవరి 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం (All-party Meet) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 11.30 గంటలకు సమావేశానికి రావాల్సిందిగా అన్ని పార్టీల సభాపక్ష నేతలకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ సమాచారం అందించింది.

జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు పార్లమెంటు (Parliament) బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించనున్నారు. సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections) ముందు నిర్వహించనున్న చివరి సమావేశాలు ఇవే. కీలక బిల్లులన్నింటికీ గత సమావేశాల్లోనే ఆమోదం తెలపడంతో ప్రభుత్వం ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ (Interim Budget) పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు సమాచారం. ఏప్రిల్‌-మేలో జరిగే ఎన్నికల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెడుతుంది.

త్వరలో ప్రజలే నీతీశ్‌కు బుద్ధి చెబుతారు: శరద్‌ పవార్‌

పార్లమెంటు సమావేశాలకు ముందు అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసే సంప్రదాయం చాలాఏళ్లుగా కొనసాగుతోంది. ప్రభుత్వ అజెండాను విపక్షాలకు వివరించడం, తాము లేవనెత్తే అంశాలను విపక్షాలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాయి. సుహృద్భావ వాతావరణంలో సమావేశాలు కొనసాగేందుకు సహకరించాలని విపక్ష పార్టీలను కేంద్ర ప్రభుత్వం కోరే అవకాశం ఉంటుంది. ఈసందర్భంగా కొత్తగా తీసుకువచ్చిన భద్రతా ఏర్పాట్లను అన్ని పార్టీలకు వివరించనున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని