Budget Session: బడ్జెట్‌ సమావేశాలు.. కాంగ్రెస్‌ పార్లమెంటరీ బృందంకీలక చర్చ

వచ్చే వారం నుంచి పార్లమెంటులో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్‌ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. శుక్రవారం పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన పార్టీ పార్లమెంటరీ వ్యూహ...

Published : 28 Jan 2022 13:42 IST

దిల్లీ: వచ్చే వారం నుంచి పార్లమెంటులో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్‌ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. శుక్రవారం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన పార్లమెంటరీ వ్యూహ బృందం(స్ట్రాటజీ గ్రూప్‌) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైంది. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా లేవనెత్తాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సందర్భంగా చర్చించినట్లు సమాచారం.

ప్రధానంగా కొవిడ్‌ మృతుల కుటుంబాలకు ఉపశమన ప్యాకేజీ, ఎయిర్‌ ఇండియా పెట్టుబడుల ఉపసంహరణ, ద్రవ్యోల్బణం, చైనాతో సరిహద్దు వివాదం, రైతుల సమస్యలు తదితర అంశాలను రానున్న సమావేశాల్లో లేవనెత్తాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సమస్యలపై పోరాడేందుకు ముందుకొచ్చే ఇతర పార్టీలతోనూ సమన్వయం చేసుకోవాలని ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ సీనియర్ ఎంపీలు ఏకే ఆంటోనీ, కేసీ వేణుగోపాల్, మల్లికార్జున్ ఖర్గే, అధిర్ రంజన్ చౌధురి, ఆనంద్ శర్మ, గౌరవ్ గొగోయ్, జైరాం రమేశ్‌, మాణికం ఠాగూర్, మనీష్ తివారీ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న పార్లమెంటులో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని