కీలక రహస్యాలను ఇంటర్నెట్‌లో పంచుకోవద్దు..!

కీలక రహస్యాలను వాటికి సంబంధించిన పత్రాలను ఇంటర్నెట్‌లో పంచుకోవద్దని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ముఖ్యంగా డిజిటల్‌ అసిస్టెంట్లను ఆఫీసుల్లో వినియోగించవద్దని పేర్కొంది.

Published : 19 Feb 2022 01:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కీలక రహస్యాలను వాటికి సంబంధించిన పత్రాలను ఇంటర్నెట్‌లో పంచుకోవద్దని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ముఖ్యంగా డిజిటల్‌ అసిస్టెంట్లను ఆఫీసుల్లో వినియోగించవద్దని పేర్కొంది. ముఖ్యంగా అమెజాన్‌ ఎకో, యాపిల్‌ హోం ప్యాడ్‌, గూగుల్‌ హోం వంటి వాడవద్దని తెలిపింది. దీంతోపాటు అలెక్సా, సిరి వంటి అసిస్టెంట్లను వాడొద్దని పేర్కొంది. కీలకమైన రహస్య సమావేశాలు నిర్వహించే సమయంలో ఫోన్లను సమావేశ మందిరానికి బయటే డిపాజిట్‌ చేసి రావాలని ఆదేశించింది. 

ఇటీవల కాలంలో పెద్ద సంఖ్యలో ప్రభుత్వ అధికారులు కీలక సమాచారాన్ని పంపించడానికి వాట్సాప్‌, టెలిగ్రామ్‌ వంటి యాప్స్‌ను ఉపయోగిస్తున్నట్లు కేంద్రం గుర్తించింది. అటువంటి పనులు చేయడం అంటే ఆయా విభాగాల భద్రతా పరమైన నియమాలను, నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ పాలసీ గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘించినట్లే అని పేర్కొంది. ముఖ్యంగా ప్రభుత్వ రహస్యాలకు సంబంధించిన పత్రాలను క్లోజ్డ్‌ నెట్‌వర్క్‌లో మాత్రమే షేర్‌ చేసుకోవాలని పేర్కొంది. అది కూడా సైంటిఫిక్‌ అనాలసిస్‌ గ్రూప్(ఎస్‌ఏజీ) స్థాయి ఎన్‌క్రిప్షన్‌ అయి ఉండాలని పేర్కొంది. ఎస్‌ఏజీ గ్రూప్‌ డీఆర్‌డీవో పరిధిలో పనిచేస్తుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు