స్వలింగ పెళ్లిళ్లకు గుర్తింపు తీవ్ర అభ్యంతరకరం.. రాష్ట్రపతికి ప్రముఖుల లేఖ

మత విశ్వాసాలు, సంప్రదాయాలకు భిన్నంగా స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించే యత్నాలు తీవ్ర అభ్యంతరకరమైనవని 120 మంది ప్రముఖులు పేర్కొన్నారు.

Updated : 29 Apr 2023 07:21 IST

దిల్లీ: మత విశ్వాసాలు, సంప్రదాయాలకు భిన్నంగా స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించే యత్నాలు తీవ్ర అభ్యంతరకరమైనవని 120 మంది ప్రముఖులు పేర్కొన్నారు. ఈ మేరకు వారు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాశారు. అసహజమైన, నిర్హేతుకమైన స్వలింగ పెళ్లిళ్లను వ్యవస్థీకృతం చేయడాన్ని భారతీయ సమాజం, సంస్కృతి ఆమోదించబోవని తెలిపారు. దేశ మౌలిక సాంస్కృతిక సంప్రదాయాలు, మతాచారాలపై నిరంతరంగా దాడులు జరగడం తమను నిర్ఘాంతపరుస్తోందని వివరించారు. ఈ లేఖపై సంతకాలు చేసిన వారిలో హైకోర్టు పూర్వ జడ్జీలు, మాజీ ఉన్నతాధికారులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని