ఎవరెస్ట్‌ను అధిరోహించిన తొలి తమిళ మహిళ

ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్టును అధిరోహించిన తొలి తమిళ మహిళగా విరుదునగర్‌కు చెందిన ముత్తమిళ్‌ సెల్వి నిలిచారు.

Published : 28 May 2023 04:56 IST

చెన్నై (సైదాపేట), న్యూస్‌టుడే: ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్టును అధిరోహించిన తొలి తమిళ మహిళగా విరుదునగర్‌కు చెందిన ముత్తమిళ్‌ సెల్వి నిలిచారు. విరుదునగర్‌ జిల్లా జోగిలపట్టి గ్రామానికి చెందిన నారాయణన్‌ - మూర్తియమ్మాళ్‌ల కుమార్తె ముత్తమిళ్‌ సెల్వి. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చెన్నైలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేసే సెల్వి.. ఎవరెస్ట్‌ శిఖరం అధిరోహించాలనే లక్ష్యంతో శిక్షణ తీసుకున్నారు. దీనికి తమిళనాడు ప్రభుత్వ సాయం కోరగా.. ముఖ్యమంత్రి స్టాలిన్‌ రూ.15 లక్షలు, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ రూ.10 లక్షలు అందజేశారు. ఏప్రిల్‌ 2న చెన్నై నుంచి బయలుదేరిన ముత్తమిళ్‌ సెల్వి ఏప్రిల్‌ 5న ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించడం ప్రారంభించారు. 51 రోజుల అనంతరం మే 23న శిఖరంపైకి చేరుకున్నారు. తద్వారా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మొదటి తమిళ మహిళగా ముత్తమిళ్‌ సెల్వి రికార్డు సృష్టించారు. ఆమెకు ముఖ్యమంత్రి స్టాలిన్‌, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ శుక్రవారం రాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని