సిసోదియాకు స్వల్ప ఊరట

మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్‌ జైల్లో ఉన్న దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆప్‌ నేత మనీశ్‌ సిసోదియాకు శుక్రవారం స్వల్ప ఊరట లభించింది.

Published : 03 Jun 2023 04:43 IST

అనారోగ్యంతో ఉన్న భార్యను చూసేందుకు అనుమతి

దిల్లీ: మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్‌ జైల్లో ఉన్న దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆప్‌ నేత మనీశ్‌ సిసోదియాకు శుక్రవారం స్వల్ప ఊరట లభించింది. అనారోగ్యంతో బాధపడుతున్న భార్య సీమాను చూసి వచ్చేందుకు దిల్లీ హైకోర్టు ఆయనకు కొన్ని గంటల పాటు అనుమతిచ్చింది. ఇందుకు కొన్ని షరతులు విధించింది. సిసోదియా తన వెంట సెల్‌ఫోన్‌ వంటి పరికరాలను తీసుకెళ్లరాదని, ఇంటర్నెట్‌ను వినియోగించరాదని, మీడియాతో మాట్లాడొద్దని కోర్టు స్పష్టం చేసింది. సిసోదియాను శనివారం ఉదయం 10 గంటలకు ఆయన ఇంటికి తీసుకెళ్లి సాయంత్రం 5 గంటలకు తీసుకురావాలని తిహాడ్‌ జైలు సూపరింటెండెంట్‌ను న్యాయమూర్తి జస్టిస్‌ దినేశ్‌కుమార్‌ శర్మ ఆదేశించారు. సిసోదియా భార్య వైద్య పత్రాలను పరిశీలించి శనివారం సాయంత్రం లోగా నివేదిక సమర్పించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌(ఈడీ)కు జడ్జి సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని