సోదరి కులాంతర వివాహం.. బైక్‌పై వచ్చి ఎత్తుకెళ్లిన అన్న
కుటుంబ ఇష్టానికి విరుద్ధంగా ప్రేమించిన యువకుణ్ని ఓ యువతి కులాంతర వివాహం చేసుకోగా.. ఆమె సోదరుడు బైక్‌పై వచ్చి సినీ ఫక్కీలో అత్తారింటి నుంచి తనను ఎత్తుకెళ్లాడు.
కుటుంబ ఇష్టానికి విరుద్ధంగా ప్రేమించిన యువకుణ్ని ఓ యువతి కులాంతర వివాహం చేసుకోగా.. ఆమె సోదరుడు బైక్‌పై వచ్చి సినీ ఫక్కీలో అత్తారింటి నుంచి తనను ఎత్తుకెళ్లాడు. బిహార్‌లోని అరారియా జిల్లాలో ఈ ఘటన జరిగింది. రూప, ఛోటు కుమార్ ఠాకుర్ గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. వీరిద్దరి కులాలు వేరు కావడం వల్ల యువతి కుటుంబం పెళ్లికి అంగీకరించలేదు. దీంతో కుటుంబసభ్యులను కాదని జూన్ 2న ఆమె కులాంతర వివాహం చేసుకుంది. ఆగ్రహించిన యువతి సోదరుడు పెళ్లైన మరుసటిరోజే.. మరో వ్యక్తితో కలిసి వచ్చి అత్తారింట్లో నుంచి సోదరిని బలవంతంగా బైకుపై ఎత్తుకెళ్లాడు. స్థానికులు ఈ ఘటనను సెల్‌ఫోన్లతో వీడియో తీశారు. అబ్బాయి కుటుంబం నుంచి ఫిర్యాదు అందుకున్న బథ్‌నాహ పోలీసులు యువతిని పోలీస్‌స్టేషనుకు తీసుకువచ్చి విచారించారు. రూప వాంగ్మూలం తీసుకొని, నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని పోలీసు అధికారి కుశ్రు సిరాజ్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
kushboo: ‘ఆ దేవుడే నన్ను ఎంచుకున్నారు’..: ఖుష్బూ
-
NewsClick Raids: ‘న్యూస్‌క్లిక్’పై సోదాలు.. మీడియా స్వేచ్ఛపై అమెరికా కీలక వ్యాఖ్యలు
-
Vande Bharat Sleeper: వందే భారత్‌లో స్లీపర్ కోచ్‌లు.. ఫొటోలు షేర్ చేసిన కేంద్ర మంత్రి
-
Anushka Sharma: అనుష్క శర్మ రెండోసారి తల్లి కానుందంటూ వార్తలు.. నటి ఇన్‌స్టా స్టోరీ వైరల్..!
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India-Canada: భారత్‌తో తెరవెనుక చర్చలను కొనసాగిస్తాం: కెనడా