2న కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తారు!

మద్యం కుంభకోణం కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను నవంబరు 2న ఈడీ అరెస్టు చేసే అవకాశాలున్నాయని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) సంచలన ఆరోపణలు చేసింది.

Updated : 01 Nov 2023 06:26 IST

దిల్లీ మంత్రి ఆతిశీ సంచలన ఆరోపణలు

దిల్లీ: మద్యం కుంభకోణం కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను నవంబరు 2న ఈడీ అరెస్టు చేసే అవకాశాలున్నాయని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) సంచలన ఆరోపణలు చేసింది. తమ అగ్రనేతలను జైలుకు పంపించడం ద్వారా తమ పార్టీని మనుగడలో లేకుండా చేయాలని భాజపా ప్రయత్నిస్తోందని పేర్కొంది. దిల్లీ మంత్రి ఆతిశీ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ‘‘నవంబరు 2న కేజ్రీవాల్‌ను అరెస్టు చేసే అవకాశాలున్నాయని సమాచారం అందింది. ఒకవేళ ఆయన అరెస్టయితే.. అవినీతి ఆరోపణలపై మాత్రం కాదు. భాజపాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే..! కేజ్రీవాల్‌ను చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారు. ఎన్నికల్లో కేజ్రీవాల్‌ను ఓడించలేమని భాజపాకు అర్థమైంది. అందుకే ఇలా తప్పుడు కేసులు పెడుతోంది. పార్టీ అగ్రనేతలను జైలుకు పంపి ఆప్‌ను అంతం చేయాలని భాజపా భావిస్తోంది’’ అని ఆతిశీ దుయ్యబట్టారు. నవంబరు 2న తమ ఎదుట హాజరుకావాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని