1950లను దృష్టిలో ఉంచుకొని ప్రైవేటు ఆస్తిపై వ్యాఖ్యానం చేయకూడదు: సుప్రీం

‘‘ఏ ప్రైవేటు ఆస్తి సమాజ వనరు కాదు.. అన్ని ప్రైవేటు ఆస్తులూ సమాజ వనరులే .. ఈ రెండు పరస్పర భిన్నమైన విధానాలు.

Published : 01 May 2024 04:53 IST

దిల్లీ: ‘‘ఏ ప్రైవేటు ఆస్తి సమాజ వనరు కాదు.. అన్ని ప్రైవేటు ఆస్తులూ సమాజ వనరులే .. ఈ రెండు పరస్పర భిన్నమైన విధానాలు. వీటిపై ప్రస్తుత ప్రైవేటీకరణ, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సమకాలీన వ్యాఖ్యానం చేయాల్సిన అవసరం ఉంది’’ అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను సమాజ వనరుగా పరిగణించొచ్చా అన్న కీలక కేసుపై మంగళవారం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘1950ల్లో భారతదేశాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు వ్యాఖ్యానం చేయకూడదు. అప్పుడు జాతీయీకరణ జరుగుతోంది. ఇప్పుడు పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతోంది. ప్రైవేటు పెట్టుబడులు ఉన్నాయి. ఇది పరివర్తన. కాబట్టి న్యాయస్థానం వ్యాఖ్యానం కొత్తగా ఉండాలి. ప్రస్తుత భారత్‌కు అనుగుణంగా ఉండాలి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలి’’ అని ధర్మాసనం పేర్కొంది. ప్రస్తుత కేసులో అధికరణాలు 39(బి), 31(సి)లను ధర్మాసనం పరిశీలిస్తోంది. ప్రైవేటు ఆస్తులను సమాజవనరుగా పరిగణించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చా లేదా అన్న అంశంపై వాదనలను వింటోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని