ప్రజ్వల్‌పై నివేదికకు మహిళా కమిషన్‌ ఆదేశం

కర్ణాటక ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ ఉదంతంపై అన్ని వివరాలతో మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆ రాష్ట్ర డీజీపీని జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) ఆదేశించింది.

Published : 01 May 2024 04:54 IST

దిల్లీ: కర్ణాటక ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ ఉదంతంపై అన్ని వివరాలతో మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆ రాష్ట్ర డీజీపీని జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) ఆదేశించింది. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వేర్వేరు వీడియోల నేపథ్యంలో ఈ మేరకు డీజీపీని ఉద్దేశించి మంగళవారం లేఖ రాసింది. దేశం విడిచి పరారైనట్లు చెబుతున్న నిందితుడిని పట్టుకునేందుకు వెంటనే నిర్ణయాత్మక చర్యలు చేపట్టాలని పేర్కొంది. మహిళల భద్రత, హుందాతనాలకు భంగం కలగకుండా చూడాలంది. జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ.. అది తమనెంతో కలచివేసిందని తెలిపింది. ‘..ఇలాంటి పరిణామాలు మహిళాభద్రతకు ప్రమాదం తీసుకువస్తాయి. వారిని అగౌరవపరిచేందుకు, వారిపై హింసను ప్రేరేపించేందుకు దారితీస్తాయి’ అని ఎన్‌సీడబ్ల్యూ పేర్కొంది. అంతకుముందు అఖిల భారత మహిళా కాంగ్రెస్‌ తరఫున అధ్యక్షురాలు అల్కా లాంబా ఎన్‌సీడబ్ల్యూకి లేఖ రాస్తూ- ఆరోపణల తీవ్రత దృష్ట్యా వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని