కేరళ తీర ప్రాంతాన్ని ముంచెత్తిన కెరటాలు

కేరళ తీరప్రాంతంలోని అనేక ప్రాంతాల్లో సాగర కెరటాలు విరుచుకుపడుతున్నాయి. కొన్నిచోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. ఈ పోకడను ‘కళ్లక్కడళ్‌’ అంటారు.

Updated : 06 May 2024 05:08 IST

తిరువనంతపురం: కేరళ తీరప్రాంతంలోని అనేక ప్రాంతాల్లో సాగర కెరటాలు విరుచుకుపడుతున్నాయి. కొన్నిచోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. ఈ పోకడను ‘కళ్లక్కడళ్‌’ అంటారు. దీనివల్ల తీరప్రాంతంలోని అనేక గ్రామాల్లో ఇళ్లు దెబ్బతిన్నాయి. రోడ్లు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. కొన్ని ప్రాంతాల్లో మత్స్యకారులు తమ పడవలు, వలలను కాపాడుకోవడానికి తంటాలు పడ్డారు. దక్షిణ కేరళ, తమిళనాడులోని తీర ప్రాంతాల్లో ఆదివారం అర్ధరాత్రి వరకూ ఈ పోకడ కొనసాగుతుందని అధికారులు ‘ఆరంజ్‌ అలర్ట్‌’ జారీ చేశారు.హిందూ మహాసముద్రంలోని దక్షిణ ప్రాంతంలో బలమైన గాలులు పెరగడం వల్ల అకస్మాత్తుగా ఇలా జరుగుతుంది. కళ్లక్కడళ్‌ అంటే.. దొంగలా ఆకస్మికంగా వచ్చే సముద్రమని అర్థం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని