High Court: అలాంటి సహజీవనం చట్ట వ్యతిరేకం

ఓ వివాహిత మరొక వ్యక్తితో సహజీవనం చేయడం హిందూ వివాహ చట్టానికి వ్యతిరేకమని అలహాబాద్‌ హైకోర్టు పేర్కొంది. తాము సహజీవనం చేస్తున్నామని, కుటుంబ సభ్యులు దాడి

Updated : 18 Jun 2021 07:06 IST

వివాహిత, ఆమె ప్రియుడికి హైకోర్టులో రూ.5 వేల జరిమానా

అలహాబాద్‌: ఓ వివాహిత మరొక వ్యక్తితో సహజీవనం చేయడం హిందూ వివాహ చట్టానికి వ్యతిరేకమని అలహాబాద్‌ హైకోర్టు పేర్కొంది. తాము సహజీవనం చేస్తున్నామని, కుటుంబ సభ్యులు దాడి చేయకుండా రక్షించాలని కోరుతూ ఓ వివాహిత, ఆమె ప్రియుడు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ వ్యాఖ్య చేసింది. ప్రశాంతంగా సాగుతున్న తమ జీవితంలో భర్తగానీ, ఇతరులుగానీ ఇబ్బందులు కలిగించకుండా చూడాలని పిటిషనర్‌ కోరారు. ఈ పిటిషన్‌ను కొట్టివేసిన జస్టిస్‌ కౌశల్‌ జయేంద్ర ఠాకెర్‌, జస్టిస్‌ దినేశ్‌ పాఠక్‌లతో కూడిన ధర్మాసనం వారికి రూ.5000 జరిమానా విధించింది. రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ ఉందని, కానీ అది చట్టం పరిధిలో ఉండాలని తెలిపింది. సమాజంలో చట్టవ్యతిరేక చర్యను ప్రోత్సహిస్తున్న ఇలాంటి పిటిషన్‌ను ఎలా అంగీకరించగలమని ప్రశ్నించింది. భర్త నుంచి ఏమైనా ఇబ్బందులు ఉండి ఉంటే తొలుత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉందని పేర్కొంది. కానీ అలా జరగలేదని తెలిపింది. జీవితానికి, స్వేచ్ఛకు రక్షణ కల్పించాలన్న పేరుతో వివాహేతర సహజీవనానికి అనుమతించలేమని స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని