మారడోనా చేతి గడియారం అస్సాంలో స్వాధీనం

సాకర్‌ మాంత్రికుడు డీగో మారడోనా వినియోగించిన ఖరీదైన చేతి గడియారాన్ని దుబాయిలో చోరీ చేసిన వ్యక్తి అస్సాంలో పోలీసులకు చిక్కాడు. దుబాయి సెంట్రల్‌ ఏజెన్సీ ఇచ్చిన సమాచారంతో అస్సాంలోని శివసాగర్‌

Published : 12 Dec 2021 04:54 IST

చోరీచేసిన నిందితుడి అరెస్టు

ఈనాడు, గువాహటి: సాకర్‌ మాంత్రికుడు డీగో మారడోనా వినియోగించిన ఖరీదైన చేతి గడియారాన్ని దుబాయిలో చోరీ చేసిన వ్యక్తి అస్సాంలో పోలీసులకు చిక్కాడు. దుబాయి సెంట్రల్‌ ఏజెన్సీ ఇచ్చిన సమాచారంతో అస్సాంలోని శివసాగర్‌ పోలీసులు శనివారం తెల్లవారుజామున వజీద్‌ హుస్సేన్‌ అనే వ్యక్తిని అరెస్ట్‌ చేసినట్లు డీజీపీ భాస్కరజ్యోతి మహంత ప్రకటించారు. యుబ్లో కంపెనీ మారడోనా సంతకంతో రూపొందించిన లిమిటెడ్‌ ఎడిషన్‌ చేతి గడియారంతోపాటు మరికొన్ని వస్తువుల చోరీ కేసులో హుస్సేన్‌ నిందితుడు. శివసాగర్‌లో అతని ఇంట్లోనే అరెస్ట్‌ చేసి చేతి గడియారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ చెప్పారు. గత ఏడాది మృతి చెందిన మారడోనా వస్తువులు మరికొన్నింటితో కలిపి ఈ చేతి గడియారాన్ని కూడా దుబాయిలో భద్రపరిచారు. ఆ వస్తువుల చోరీ కేసులో వజీద్‌ పాత్రపై అక్కడి పోలీసులు ఇచ్చిన సమాచారంతో అరెస్ట్‌ చేసిన అస్సాం పోలీసులు ఇతర వస్తువుల వివరాలకోసం అతడిని విచారిస్తున్నారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని