పంజాబ్‌లో ఈడీ దాడులు.. సీఎం మేనల్లుడి నుంచి రూ.8 కోట్లు స్వాధీనం

ఎన్నికల వేళ.. పంజాబ్‌లోని ఇసుక అక్రమ తవ్వక వ్యాపారులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నిర్వహించిన దాడుల్లో అధికారులు రూ.10 కోట్ల నగదు, రూ.21 లక్షల విలువైన బంగారం,

Updated : 20 Jan 2022 06:29 IST

దిల్లీ/చండీగఢ్‌: ఎన్నికల వేళ.. పంజాబ్‌లోని ఇసుక అక్రమ తవ్వక వ్యాపారులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నిర్వహించిన దాడుల్లో అధికారులు రూ.10 కోట్ల నగదు, రూ.21 లక్షల విలువైన బంగారం, రూ.12 లక్షల విలువైన చేతి గడియారం, పలు మొబైల్‌ ఫోన్లు జప్తు చేశారు. ఇందులో పంజాబ్‌ సీఎం చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ మేనల్లుడు భూపీందర్‌ సింగ్‌ అలియాస్‌ హనీకి చెందిన రూ.8 కోట్లు కూడా ఉన్నాయి. ఈ మేరకు ఈడీ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. మిగిలిన రెండు కోట్లను సందీప్‌ కుమార్‌ అనే వ్యక్తికి చెందిన కార్యాలయాలు, నివాసాల నుంచి జప్తు చేశామని పేర్కొంది. చండీగఢ్‌, మొహాలి, లుథియానా, పఠాన్‌కోట్‌.. తదితర ప్రాంతాల్లో 12కు పైగా ప్రదేశాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ దాడులపై ఇప్పటికే సీఎం చరణ్‌జీత్‌ స్పందించారు. ఇవి రాజకీయ ప్రేరితమని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల సమయంలోనూ సీఎం మమతా బెనర్జీ బంధువుల ఇళ్లపై కేంద్రం ఈడీ దాడులు చేయించిందని, పంజాబ్‌లోనూ ఇప్పుడు అదే జరుగుతోందని చన్నీ విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని