ప్రతి రోజూ 150కి.మీ. ప్రయాణించి నర్సుగా సేవలు.. జిమ్‌లో కసరత్తులు

నర్సుగా విధులు నిర్వహిస్తూనే బాడీబిల్డింగుకు కృషి చేస్తోంది బెంగాల్‌లోని మాల్డాకు చెందిన లిపిక (25). ఇందుకోసం ఆమె రోజుకు 150 కిలోమీటర్ల బస్సు ప్రయాణం చేస్తోంది.

Updated : 09 May 2022 09:14 IST

నర్సుగా విధులు నిర్వహిస్తూనే బాడీబిల్డింగుకు కృషి చేస్తోంది బెంగాల్‌లోని మాల్డాకు చెందిన లిపిక (25). ఇందుకోసం ఆమె రోజుకు 150 కిలోమీటర్ల బస్సు ప్రయాణం చేస్తోంది. ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా సాధన చేస్తున్నట్లు చెబుతున్న లిపిక గత ఏప్రిల్‌లో జరిగిన అంతర్జాతీయస్థాయి పోటీల్లో ఆరోస్థానంలో నిలిచి ఔరా అనిపించింది. డ్యూటీ ధలాయ్‌ జిల్లాలోని సలేమా గ్రామానికి చెందిన లిపిక నర్సుగా ప్రభుత్వ ఉద్యోగం సాధించి, 2020లో మాల్డాలోని చంచల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి విధుల్లో చేరింది. రోజూ ఉదయం చంచల్‌లో బస్సు ఎక్కి మాల్డాకు వచ్చి.. కోచ్‌ పింకు భగత్‌ ఆధ్వర్యంలో కొన్ని గంటలపాటు శిక్షణ తీసుకొంటుంది. ఆ తర్వాత తిరిగి చంచల్‌కు వెళ్లి ఆసుపత్రిలో సేవలందిస్తుంది. గత నెల పుణెలో జరిగిన అంతర్జాతీయస్థాయి మిస్టర్‌ అండ్‌ మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో ఆరోస్థానంలో నిలిచింది. ‘చిన్నప్పటి నుంచే వ్యాయామం అంటే ఇష్టం. తల్లిదండ్రులకు నేను ఒక్కదాన్నే. నాన్న రిటైర్డ్‌ టీచర్‌. చిన్నప్పుడు ఆయనే జిమ్‌కు తీసుకువెళ్లేవారు’ అని చెబుతోంది లిపిక.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని