యువతిపై సామూహిక అత్యాచారం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో ఓ యువతిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన దెల్హపుర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం జరిగింది. స్నేహితుడితో కలిసి బాధితురాలు బయటకు వెళ్లింది.

Updated : 25 Sep 2022 05:42 IST

ప్రతాప్‌గఢ్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో ఓ యువతిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన దెల్హపుర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం జరిగింది. స్నేహితుడితో కలిసి బాధితురాలు బయటకు వెళ్లింది. గంజెహ్రా అటవీ ప్రాంతంలో మరో ఇద్దరితో కలిసి యువతి స్నేహితుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దారుణాన్ని వీడియో తీశాడు. అత్యాచారం జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బాధితురాలిని బెదిరించాడు. అనంతరం బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. నిందితులు ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. బాలికను చూసిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు బాలికను ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని ఇప్పటికే అరెస్ట్‌ చేశామని.. పరారీలో ఉన్న మరొకరి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.


బాలికపై వలస కూలీల అఘాయిత్యం

ఓ మైనర్‌పై నలుగురు వలస కూలీలు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన కేరళలోని కోజీకోడ్‌లో జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 16 ఏళ్ల బాలికకు రైలు ప్రయాణంలో ప్రధాన నిందితుడితో పరిచయం ఏర్పడింది. ఆమె తన సోదరిని కలవడానికి వారణాసి నుంచి చెన్నైకి వెళ్తోంది. నిందితుడు.. బాధితురాలికి మాయమాటలు చెప్పి చెన్నైలో దిగకుండా చేశాడు. అనంతరం పాలక్కడ్‌ తీసుకెళ్లాడు. అక్కడి నుంచి ఆమెతో కలిసి కోజీకోడ్‌కు చేరుకున్నాడు. బాధితురాలిని పాళయంలోని ఓ లాడ్జికి తీసుకెళ్లి మరో ముగ్గురితో కలిసి సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం బాధితురాలిని కోజీకోడ్‌ రైల్వేస్టేషన్‌ పట్టాల సమీపంలో వదిలేసి పరారయ్యారు. నిందితులందరినీ శనివారం అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు యూపీకి చెందిన వాడని పోలీసులు తెలిపారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని