Boy Friend: ‘టాయ్‌ బాయ్‌’.. అద్దెకు బాయ్‌ ఫ్రెండ్‌!

గంటల ఆధారంగా మీకు కావలసిన బాయ్‌ ఫ్రెండ్‌ను బాడుగకు ఇస్తామంటూ బెంగళూరులో కొందరు టెకీలు ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించడం సంచలనంగా మారింది.

Updated : 27 Sep 2022 09:13 IST

బెంగళూరు టెకీల కొత్త స్టార్టప్‌

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: గంటల ఆధారంగా మీకు కావలసిన బాయ్‌ ఫ్రెండ్‌ను బాడుగకు ఇస్తామంటూ బెంగళూరులో కొందరు టెకీలు ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించడం సంచలనంగా మారింది. ప్రియుడు వంచించాడనో, ప్రేమ విఫలమైందనో, నిజమైన ప్రేమ దక్కలేదనో వ్యథకు గురైన వారికి ‘టాయ్‌ బాయ్‌’ పేరిట వీరు ఒక పోర్టల్‌ను ప్రారంభించారు. కాకపోతే ఆ ‘బాయ్‌’ ఎవరి వద్దకూ భౌతికంగా రాడు. ఫోన్‌ ద్వారా వారి సమస్యను పూర్తిగా విని మానసిక ఆందోళనను దూరం చేసేందుకు సహకారం అందిస్తాడని పోర్టల్‌ను అభివృద్ధి చేసిన కౌశల్‌ ప్రకాశ్‌ తెలిపారు.

దీనినొక స్టార్టప్‌గా తాము రూపొందించామని, దీంతోపాటు ఆర్‌ఏబీఎఫ్‌ అనే యాప్‌ను అభివృద్ధి చేశామని ఆయన పేర్కొన్నారు. తమ పోర్టల్‌, యాప్‌లోని సేవలను నిర్ణీత రుసుము చెల్లించి, వినియోగించుకోవలసి ఉంటుందని వివరించారు. మానసిక సమస్యలు, ఒంటరితనంతో బాధపడేవారికి సానుకూల వచనాలతో ధైర్యం చెప్పడానికి, కౌన్సెలింగ్‌ ఇవ్వడానికి ఇప్పటికే చాలా వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రేమలో విఫలమైన యువతులకు ఉద్దేశించి ‘టాయ్‌ బాయ్‌’ పేరుతో అబ్బాయిలను అద్దెకు (ఫోన్‌ ద్వారా) ఇస్తామనడమే ఇక్కడ వివాదాస్పదంగా మారింది. దీని మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని