Hernia treatment: రూ.50కే హెర్నియా శస్త్రచికిత్స

కోల్‌కతాకు చెందిన పీపుల్‌ రిలీఫ్‌ కమిటీ తన 80వ వార్షికోత్సవం సందర్భంగా.. ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించనుంది.

Published : 31 Oct 2022 09:14 IST

కోల్‌కతాకు చెందిన పీపుల్‌ రిలీఫ్‌ కమిటీ తన 80వ వార్షికోత్సవం సందర్భంగా.. ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించనుంది. కేవలం రూ.50కే వరిబీజము (హెర్నియా) శస్త్రచికిత్స నిర్వహించేందుకు ముందుకొచ్చింది. 1943 సంవత్సరంలో ప్రారంభమైన ఈ సంస్థ.. 2023లో 80 సంవత్సరాలు పూర్తిచేసుకోనుంది. ఈ నేపథ్యంలోనే 80 రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. స్వాతంత్య్రం పూర్వం నుంచే ఎన్నో వైద్య పరీక్షలను, ఆరోగ్య సదుపాయాలను తక్కువ ధరలకే అందించిన పీపుల్‌ రిలీఫ్‌ కమిటీ.. నేటికి సమాజ శ్రేయస్సు కోసం పాటు పడుతున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ‘‘సాధారణంగా హెర్నియా శస్త్రచికిత్సకు రూ.10వేలు ఖర్చు అవుతుంది. మేం   కేవలం రూ.50కే చేస్తాం. ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి కళ్లద్దాలు పంపిణీ చేస్తాం. ఖర్చులు భరించలేని వారికి ఉచితంగా సేవలు అందిస్తాం’’ అని సంస్థ కార్యదర్శి ఫాడ్‌ హలిమ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని