‘నాకు భార్యవి అవుతావా?’.. ఇన్‌స్టాలో బాలుడి స్టేటస్‌

మహారాష్ట్రలో ఓ పాఠశాల విద్యార్థి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన స్టేటస్‌ అందర్నీ ఆశ్చర్యపరిచింది. అది అతనిపై కేసు నమోదుకు కారణమైంది. పుణెలో ఓ 14 ఏళ్ల పాఠశాల విద్యార్థి.. తన పాఠశాలలో చదివే 13 ఏళ్ల బాలికను తనతో స్నేహం చేయాలని ఆమె వెంటపడేవాడు.

Updated : 24 Nov 2022 09:33 IST

కేసు నమోదు చేసిన పోలీసులు

మహారాష్ట్రలో ఓ పాఠశాల విద్యార్థి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన స్టేటస్‌ అందర్నీ ఆశ్చర్యపరిచింది. అది అతనిపై కేసు నమోదుకు కారణమైంది. పుణెలో ఓ 14 ఏళ్ల పాఠశాల విద్యార్థి.. తన పాఠశాలలో చదివే 13 ఏళ్ల బాలికను తనతో స్నేహం చేయాలని ఆమె వెంటపడేవాడు. లేదంటే ఎత్తుకు పోతానని బెదిరించాడు. అయినా.. ఆ బాలిక అతడిని పట్టించుకోలేదు. దీంతో కోపం పెంచుకున్న అతను.. ఆ బాలికను ఫొటో తీసి.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘నువ్వు నా భార్యవి అవుతావా?’ అంటూ స్టేటస్‌ పెట్టాడు. దీన్ని చూసిన బాలిక జరిగిన విషయాన్ని తన తల్లి దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. అదుపులోకి తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని