హంపీ ఆటో వాలా.. బెల్జియం భామ ప్రేమ పెళ్లి

బెల్జియం యువతి, హంపీలోని ఆటో డ్రైవర్‌ను హిందూ సంప్రదాయం ప్రకారం వివాహమాడిన అపురూప ఘట్టం శుక్రవారం ఆవిష్కృతమైంది.

Updated : 26 Nov 2022 05:12 IST

హొసపేటె, న్యూస్‌టుడే: ‘ఈ తూరుపు...ఆ పశ్చిమం సంగమించిన శుభవేళల్లో’... అనే ఈ పాట రెండు దశాబ్దాల క్రితం విడుదలైన తెలుగు సినిమా ‘పడమటి సంధ్యారాగం’లోనిది. భారతదేశానికి చెందిన నటి విజయశాంతి, అమెరికా యువకుడిని పరిణయమాడే సినిమా కథ ఇది. అలాంటి ఓ ప్రేమ పరిణయ కథకు దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కర్ణాటకలోని హంపీ వేదికైంది. బెల్జియం యువతి, హంపీలోని ఆటో డ్రైవర్‌ను హిందూ సంప్రదాయం ప్రకారం వివాహమాడిన అపురూప ఘట్టం శుక్రవారం ఆవిష్కృతమైంది. నాలుగేళ్ల కిందట కెమిల్‌ తన కుటుంబంతో హంపీ వీక్షణకు వచ్చారు. ఆ సమయంలో ఆంగ్లం తెలిసిన ఆటోవాలా అనంతరాజుతో ఆమెకు పరిచయమైంది. ఇద్దరి మధ్య స్నేహం కుదిరి, ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుని రెండు కుటుంబాలను ఒప్పించారు. కెమిల్‌ తల్లిదండ్రులు బెల్జియంలో పెళ్లి చేయాలని భావించగా... ఆమె మాత్రం హిందు సంప్రదాయ పద్ధతిలో హంపీలోనే పెళ్లి చేసుకుంటానని భీష్మించారు. కరోనా కారణంగా వివాహం వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు బంధువుల సమక్షంలో విరూపాక్ష ఆలయ ఆవరణలో పెళ్లి చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని