హిందీకి వ్యతిరేకంగా... వృద్ధుడి ఆత్మాహుతి

కేంద్రం హిందీని బలవంతంగా రుద్దుతోందని ఆరోపిస్తూ డీఎంకే నేత ఒకరు ఆత్మాహుతికి పాల్పడ్డారు. తమిళనాడులోని సేలం జిల్లా మేట్టూర్‌ సమీపంలోని తాళైయూర్‌కు చెందిన వ్యక్తి తంగవేల్‌ (85)... డీఎంకే వ్యవసాయ విభాగం నంగవళ్లి యూనియన్‌ మాజీ నిర్వాహకులు.

Updated : 27 Nov 2022 05:01 IST

సేలం, న్యూస్‌టుడే: కేంద్రం హిందీని బలవంతంగా రుద్దుతోందని ఆరోపిస్తూ డీఎంకే నేత ఒకరు ఆత్మాహుతికి పాల్పడ్డారు. తమిళనాడులోని సేలం జిల్లా మేట్టూర్‌ సమీపంలోని తాళైయూర్‌కు చెందిన వ్యక్తి తంగవేల్‌ (85)... డీఎంకే వ్యవసాయ విభాగం నంగవళ్లి యూనియన్‌ మాజీ నిర్వాహకులు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి ఆయన పలు ఆందోళనల్లో పాల్గొని జైలుకు వెళ్లొచ్చారు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి నుంచి పలు పురస్కారాలు అందుకున్నారు. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం హిందీని బలవంతంగా రుద్దుతోందని ఆరోపిస్తూ తాళైయూర్‌ పార్టీ కార్యాలయం దగ్గర తంగవేల్‌ శనివారం ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నారు. హిందీకి వ్యతిరేకంగా ఆత్మాహుతికి పాల్పడుతున్నట్లు ఓ లేఖ రాశారు. ఆయన మృతదేహానికి మంత్రి గణేశన్‌ పూలదండ వేసి నివాళి అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ తరఫున నగదు సహాయం అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని