కచ్‌ చిత్రాలు తీసిన ఓషన్‌శాట్‌-3

తిరుపతి జిల్లాలోని షార్‌ నుంచి నవంబరు 26న పీఎస్‌ఎల్‌వీ-సి54 రాకెట్‌ ద్వారా నింగిలోకి వెళ్లిన ఓషన్‌శాట్‌-3 (ఈవోఎస్‌-06), భూటాన్‌ శాట్‌ ఉపగ్రహాలు శాస్త్రవేత్తల అంచనాలకు తగ్గట్లు పని చేస్తున్నాయి.

Published : 01 Dec 2022 05:20 IST

శ్రీహరికోట, న్యూస్‌టుడే: తిరుపతి జిల్లాలోని షార్‌ నుంచి నవంబరు 26న పీఎస్‌ఎల్‌వీ-సి54 రాకెట్‌ ద్వారా నింగిలోకి వెళ్లిన ఓషన్‌శాట్‌-3 (ఈవోఎస్‌-06), భూటాన్‌ శాట్‌ ఉపగ్రహాలు శాస్త్రవేత్తల అంచనాలకు తగ్గట్లు పని చేస్తున్నాయి. వాటికి సంబంధించిన తొలి డేటా శాస్త్రవేత్తలకు చేరింది. ఓషన్‌శాట్‌ ఉపగ్రహం గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతంతోపాటు అరేబియా సముద్రం, హిమాలయాలను చిత్రీకరించింది. వాటిని తెలంగాణ షాద్‌నగర్‌లోని నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ నుంచి స్వీకరించారు. ఓషన్‌ కలర్‌ మానిటర్‌ (ఓసీఎం), సీ సర్ఫేస్‌ టెంపరేచర్‌ మానిటర్‌ (ఎస్‌ఎస్‌టీఎం) సెన్సార్ల ద్వారా వాటిని అభివృద్ధి చేసి బెంగళూరులోని కేంద్ర కార్యాలయానికి నివేదించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని