అండమాన్‌ దీవులకు ధీర సైనికుల పేర్లు

అండమాన్‌, నికోబార్‌ దీవుల్లోని 21 నిర్మానుష్య ద్వీపాలకు కేంద్ర ప్రభుత్వం పరమవీర చక్ర అవార్డులు పొందిన ధీర సైనికుల పేర్లు పెట్టింది.

Published : 03 Dec 2022 05:31 IST

పోర్ట్‌ బ్లెయర్‌: అండమాన్‌, నికోబార్‌ దీవుల్లోని 21 నిర్మానుష్య ద్వీపాలకు కేంద్ర ప్రభుత్వం పరమవీర చక్ర అవార్డులు పొందిన ధీర సైనికుల పేర్లు పెట్టింది. ఈ దీవుల్లో 16 ఉత్తర, మధ్య అండమాన్‌లో, అయిదు దక్షిణ అండమాన్‌లో ఉన్నాయి. మొట్టమొదటి నిర్మానుష్య దీవి అయిన ఐఎన్‌ఏఎన్‌ 370 నంబరు దీవికి సోమనాథ్‌ ద్వీపం అని నామకరణం చేశారు. 1947 నవంబరు 3న శ్రీనగర్‌ విమానాశ్రయంలో పాకిస్థానీ చొరబాటుదారులపై పోరులో ప్రాణాలు అర్పించి మొట్టమొదటి పరమవీర చక్ర పొందిన మేజర్‌ సోమనాథ్‌ శర్మ పేరును ఈ దీవికి పెట్టారు. ఇదే యుద్ధంలో ప్రాణత్యాగం చేసి పరమవీర చక్రను పొందిన మరో వీర సైనికుడు సుబేదార్‌ కరమ్‌ సింగ్‌ పేరును మరో నిర్మానుష్య దీవి ఐఎన్‌ఏఎన్‌ 308కి పెట్టారు. 1947 నుంచి పలు యుద్ధాల్లో వీరవిహారం చేసి పరమవీర చక్ర అవార్డులు పొందిన హవల్దార్‌ అబ్దుల్‌ హమీద్‌, సెకండ్‌ లెఫ్టినెంట్‌ అరుణ్‌ ఖేత్రపాల్‌, మేజర్‌ రామస్వామి పరమేశ్వరన్‌ తదితరుల పేర్లను మిగతా ద్వీపాలకు పెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని