పోలీసులే పెళ్లిపెద్దలుగా.. మాజీ మావోయిస్టులకు వివాహాలు

జనజీవన స్రవంతిలో కలిసిన ఇద్దరు మాజీ మహిళా మావోయిస్టులకు పోలీసులే స్వయంగా సంబంధాలు కుదిర్చి ఆదివారం వివాహాలు జరిపించారు.

Updated : 06 Dec 2022 05:26 IST

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: జనజీవన స్రవంతిలో కలిసిన ఇద్దరు మాజీ మహిళా మావోయిస్టులకు పోలీసులే స్వయంగా సంబంధాలు కుదిర్చి ఆదివారం వివాహాలు జరిపించారు. ఒడిశాలోని కొంధమాల్‌ జిల్లా గుడ్రి గ్రామానికి చెందిన సప్నితా పటమాఝి అలియాస్‌ నందిని 2019లో ఎస్పీ ఎదుట, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని గుముడి గ్రామానికి చెందిన ఫులబతి ఉసేండి అలియాస్‌ కరుణ ఇటీవల డీజీపీ ఎదుట లొంగిపోయారు. వీరికి పోలీసులు కుట్లు, అల్లికల్లో శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించారు. నందినికి దారింగిబాడికు చెందిన బినోద్‌తో, కరుణకు జి.ఉదయగిరి ప్రాంతానికి చెందిన స్వప్నేశ్వర్‌తో సంబంధం కుదిర్చారు. ఆదివారం కొంధమాల్‌ జిల్లా ఫుల్బాణీ పట్టణంలో రిజర్వు పోలీసు లైనులోని రాధాకృష్ణ మందిరంలో పోలీసుల సమక్షంలో వేదమంత్రాల సాక్షిగా ఇద్దరు మహిళా మావోయిస్టుల వివాహాలు ఘనంగా జరిపించారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని