లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి.

Published : 10 May 2024 09:52 IST

ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. గురువారం భారీ నష్టాలతో ముగిసిన సూచీలు నేడు అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో కోలుకున్నాయి. ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్‌ 247 పాయింట్లు లాభపడి.. 72652 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 87 పాయింట్ల లాభంతో 22045 వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 83.50 వద్ద కొనసాగుతోంది.

నిఫ్టీలో బీపీసీఎల్‌, ఐటీసీ, బజాజ్‌ ఆటో, యాక్సిస్‌ బ్యాంక్‌, శ్రీరామ్‌ ఫైనాన్స్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఇన్ఫోసిస్‌,  ఎల్‌టీఐ మైండ్‌ టీ, లార్సన్‌, గ్రాసిమ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. గురువారం అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. నిన్నటి ట్రేడింగ్‌లో సూచీలు భారీగా పతనం కావడంతో.. నేడు దిగువస్థాయిలో వాటి కొనుగోళ్లు జరుగుతున్నట్లు భావిస్తున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని