జీ20 ఆతిథ్యంలో సత్తా చాటుదాం

అంతర్జాతీయ స్థాయిలో కీలక పాత్ర వహించే అరుదైన అవకాశం మన దేశానికి జీ20 అధ్యక్ష హోదా ద్వారా లభించిందని ప్రధాని మోదీ తెలిపారు.

Published : 10 Dec 2022 06:11 IST

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రధాని మోదీ పిలుపు

దిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో కీలక పాత్ర వహించే అరుదైన అవకాశం మన దేశానికి జీ20 అధ్యక్ష హోదా ద్వారా లభించిందని ప్రధాని మోదీ తెలిపారు. దీనిని ఉపయోగించుకుని సత్తా చాటుకుందామని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పిలుపునిచ్చారు. జీ20 అధ్యక్ష బాధ్యతలను మన దేశం ఇటీవల చేపట్టిన విషయం తెలిసిందే. ఆ హోదాలో సుమారు 200 అంతర్జాతీయ సమావేశాలకు అతిథ్యం ఇవ్వనుంది. ఈ నెల నుంచే ఆ భేటీలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్లు, ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లతో శుక్రవారం ప్రధాని మోదీ వర్చువల్‌ విధానంలో భేటీ అయ్యారు. అందరం కలిసికట్టుగా కృషిచేసి జీ20 సమావేశాలను దిగ్విజయం చేయాలన్నారు. ఈ భేటీలను పెద్ద నగరాలకే పరిమితం చేయకుండా, ఇతర ప్రాంతాల్లోనూ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని పెట్టుబడులు రాబట్టుకోవడానికి, పర్యాటక కేంద్రాలకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకునేందుకు యత్నించాలని సూచించారు. కార్యక్రమంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ కూడా ప్రసంగించారు. ముఖ్యమంత్రులు, గవర్నర్లు పలు సూచనలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని