Transgender: రెండేళ్లు ప్రేమించి ట్రాన్స్‌జెండర్‌ను మనువాడిన యువకుడు

ఉత్తర్‌ప్రదేశ్‌ ఆజంగఢ్‌ జిల్లాకు చెందిన వీరూ రాజ్‌భర్‌(24), ఓ ట్రాన్స్‌జెండర్‌ను రెండేళ్లు ప్రేమించి శుక్రవారం పెళ్లి చేసుకోవడం హాట్‌టాపిక్‌గా మారింది.

Updated : 11 Dec 2022 07:54 IST

ఉత్తర్‌ప్రదేశ్‌ ఆజంగఢ్‌ జిల్లాకు చెందిన వీరూ రాజ్‌భర్‌(24), ఓ ట్రాన్స్‌జెండర్‌ను రెండేళ్లు ప్రేమించి శుక్రవారం పెళ్లి చేసుకోవడం హాట్‌టాపిక్‌గా మారింది. పశ్చిమబెంగాల్‌లోని జల్‌పాయ్‌గుడికి చెందిన ముస్కాన్‌ కిన్నార్‌ అనే ట్రాన్స్‌జెండర్‌ 2 ఏళ్ల క్రితం బ్రాస్‌ బ్యాండ్‌ పార్టీలో నృత్యం చేయడానికి మౌకి వచ్చింది. అక్కడ టెకై గ్రామానికి చెందిన వీరూ రాజ్‌భర్‌ను కలిసింది. మనసులు కలిసిన వారిద్దరూ అప్పటి నుంచి సహజీవనం చేస్తున్నారు. తాజాగా పెళ్లిచేసుకోవాలని అనుకున్నారు. దీనికి కుటుంబ సభ్యులు కూడా అంగీకారం తెలపడం వల్ల ఇద్దరూ భైరోధం గుడిలో సంప్రదాయ పద్ధతిలో, వేదమంత్రాల సాక్షిగా వివాహం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు