Bridge collapse: కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌.. తప్పిన ప్రమాదం

మహారాష్ట్రలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌ కుప్పకూలింది. ముందస్తుగానే ప్రమాదాన్ని గుర్తించి అధికారులు అప్రమత్తం కావడంతో ప్రాణనష్టం జరగలేదు.

Published : 17 Oct 2023 01:42 IST

ముంబయి: మహారాష్ట్రలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌ కుప్పకూలింది. ముంబయి-గోవా హైవే మార్గంలోని రత్నగిరి జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే, ఈ ప్రమాదంలో ఎవ్వరికీ గాయాలు కాలేదని సమాచారం. నిర్మాణంలో ఉన్న ఈ ఫ్లైఓవర్‌కు పగుళ్లు రావడంతోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఆ ‘గుండె చప్పుడు’ ఆపలేం.. గర్భవిచ్ఛిత్తికి నిరాకరించిన సుప్రీం కోర్టు

ముంబయి-గోవా జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా మహారాష్ట్ర రత్నగిరి జిల్లాలోని చిప్లణ్‌ నగరంలో ఫ్లైఓవర్‌ను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో బ్రిడ్జికి ఓ చోట పగుళ్లు వచ్చినట్లు సోమవారం ఉదయం గుర్తించారు. దాంతో చుట్టుపక్కల ప్రాంతాన్ని బారికేడ్లతో మూసివేసిన అధికారులు.. అటువైపు ఎవరూ వెళ్లకుండా పోలీసు సిబ్బందిని మోహరించారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలింది. దాంతో చుట్టుపక్కల రోడ్లపై ఉన్న ప్రజలు పరుగులు పెట్టారు. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బ్రిడ్జి కుప్పకూలుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని