Rajnath Singh: ఆ నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్: రాజ్‌నాథ్ సింగ్
అభివృద్ధి చెందుతోన్న దేశంగానే ఉన్న భారత్.. వందేళ్ల స్వాతంత్ర్య వేడుకలనాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.
పట్నా: భారత (India) ఆర్థిక వ్యవస్థలో గణనీయ వృద్ధి ఉందని, వందేళ్ల స్వాతంత్ర్య వేడుకలనాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా నిలుస్తుందని రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath singh) తెలిపారు. బిహార్‌లోని ఓ ప్రైవేటు యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరైన రాజ్‌నాథ్.. దేశస్థితిగతులు పూర్తిగా మారాయని చెప్పారు.
‘‘భాజపా అధికారంలోకి వచ్చేనాటికి (2014) ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో టాప్ 10 దేశాల్లో భారత్ అట్టడుగున ఉండేది. మోదీ ప్రభుత్వం వచ్చాక.. అనతికాలంలోనే టాప్ 5 దేశాల్లో ఒకటిగా నిలిచింది. 2027 నాటికి భారత్ టాప్ 3లో ఉంటుందని అంతర్జాతీయ వాణిజ్య నిపుణులు భావిస్తున్నారు’’అంటూ మోర్గాన్ స్టాన్లీ తాజా నివేదిక గురించి రాజ్‌నాథ్ ప్రస్తావించారు. వందేళ్ల స్వాతంత్ర్య వేడుకల నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా నిలుస్తుందన్నారు.
ప్రపంచంలో భారత దేశానికి గౌరవం పెరిగిందని, చాలా మంది విదేశీయులు మన దేశాన్ని ఇండియా అనే కంటే భారత్ అని పిలవడానికి మొగ్గుచూపుతున్నారని కేంద్రమంత్రి చెప్పారు. ఇది విదేశీయులకు మన దేశ సాంస్కృతిక వారసత్వంపై పెరుగుతున్న అభిమానాన్ని సూచిస్తోందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Savings: పొదుపు తగ్గి అప్పు పెరుగుతోందా? ఈ వ్యూహాలను అనుసరిద్దాం!
-
Hyderabad: అపార్ట్మెంట్ పైనుంచి దూకి పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య!
-
Asian Games: క్రికెట్లో మేం గోల్డ్ సాధించాం.. ఇక మీ వంతు: జెమీమా రోడ్రిగ్స్
-
Aadhaar: ‘ఆధార్’పై మూడీస్ సంచలన ఆరోపణలు.. గట్టిగా బదులిచ్చిన కేంద్రం
-
Justin Trudeau: ఆ ఘటన కెనడియన్లను ఇబ్బందికి గురిచేసేదే..: జస్టిన్ ట్రూడో
-
USA: భారత్‌పై ఒత్తిడి పెంచుతున్న అమెరికా.. విచారణకు సహకరించాలని కోరిన విదేశాంగ శాఖ