IndiGo: ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. దిల్లీలో అత్యవసర ల్యాండింగ్‌

దిల్లీ నుంచి దేహ్రాదూన్‌ బయలుదేరిన ఇండిగో విమానం (IndiGo Flight) ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో అత్యవసరంగా ల్యాండింగ్‌ (Emergency Landing) అయ్యింది.

Published : 21 Jun 2023 16:53 IST

దిల్లీ: దిల్లీ నుంచి దేహ్రాదూన్‌ బయలుదేరిన ఇండిగో విమానం (IndiGo Flight) ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం అత్యవసరంగా ల్యాండింగ్‌ (Emergency Landing) అయ్యింది. చివరకు సురక్షితంగా ల్యాండింగ్‌ కావడంతో అందులోని ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఇంజిన్‌లో మంటలు చెలరేగాయని వచ్చిన వార్తలను ఇండిగో ఖండించింది. సాంకేతిక లోపం కారణంగానే ఎమర్జెన్సీ ల్యాండ్‌ అయ్యిందని పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేసింది.

‘దిల్లీ నుంచి దేహ్రాదూన్‌ బయలుదేరిన ఇండిగో విమానం 6ఈ2134, సాంకేతిక కారణంతో బయలుదేరిన చోటుకే తిరిగి వచ్చింది. సమస్యను గుర్తించిన వెంటనే ఈ విషయాన్ని పైలట్‌ ఏటీసీకి తెలియజేసి అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరారు. దాంతో విమానం దిల్లీలో సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది. తదుపరి పరీక్షల అనంతరం తిరిగి ప్రయాణానికి సిద్ధమవుతుంది’ అని ఇండిగో తాజా ప్రకటనలో పేర్కొంది. దీనిపై పౌరవిమానయాన సంస్థ నుంచి ఎటువంటి స్పందన రాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని