Jharkhand HC: న్యాయమూర్తి హత్యకేసులో.. సీబీఐ దర్యాప్తుపై పర్యవేక్షణ

ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో ఓ సిట్టింగ్ న్యాయూమూర్తి హత్య కేసు విచారణలో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సాధించిన పురోగతిని ఝార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వారానికొకసారి పర్యవేక్షించనున్నారు. ఈ మేరకు సోమవారం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే సీబీఐ అందించిన సీల్డ్ కవర్‌లో పెద్దగా వివరాలు లేవని సుప్రీం పెదవి విరిచింది. 

Published : 09 Aug 2021 17:42 IST

దిల్లీ: ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో ఓ సిట్టింగ్ న్యాయూమూర్తి హత్య కేసు విచారణలో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సాధించిన పురోగతిని ఝార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వారానికొకసారి పర్యవేక్షించనున్నారు. ఈ మేరకు సోమవారం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే సీబీఐ అందించిన సీల్డ్ కవర్‌లో పెద్దగా వివరాలు లేవని సుప్రీం పెదవి విరిచింది. 

ధన్‌బాద్ జిల్లాకు చెందిన సిట్టింగ్ న్యాయమూర్తి జస్టిస్ ఉత్తమ్ ఆనంద్‌ను గతనెల గుర్తు తెలియని వ్యక్తులు ఆటోతో ఢీకొట్టి హత్య చేశారు. తొలుత ఆ ఘటనను ప్రమాదంగా భావించినా.. దర్యాప్తులో అది హత్యగా వెలుగులోకి వచ్చింది. జస్టిస్ ఆనంద్  ధన్‌బాద్‌లో అనేక మాఫియా కేసుల్ని విచారించారు. ఇటీవల ఇద్దరు గ్యాంగ్‌స్టర్లకు బెయిల్ నిరాకరించారు. ఆ తర్వాతే హత్య జరగడం కలకలం రేపింది. దీనిపై బార్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జులై 30న సుప్రీం ఈ కేసును సుమోటాగా తీసుకుని విచారించడం ప్రారంభించింది. దానిలో భాగంగానే ఈ కేసు పర్యవేక్షణ బాధ్యతను ఝార్ఖండ్ హైకోర్టుకు అప్పగించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని