Johnson & Johnson: భారత్‌లో అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు

సింగిల్ డోసు కరోనా టీకాను భారత్‌లోకి తీసుకువచ్చేందుకు ఔషధ సంస్థ జాన్సన్‌ & జాన్సన్ ప్రయత్నాలు ప్రారంభించింది.

Updated : 22 Aug 2022 15:43 IST

దిల్లీ: సింగిల్ డోసు కరోనా టీకాను భారత్‌లోకి తీసుకువచ్చేందుకు ఔషధ సంస్థ జాన్సన్‌ & జాన్సన్ ప్రయత్నాలు ప్రారంభించింది. దానిలో భాగంగా అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు చేసుకుంది. ‘సింగిల్ డోసు టీకాకు అత్యవసర వినియోగ అనుమతులు పొందేందుకు ఆగస్టు 5, 2021న భారత ప్రభుత్వానికి దరఖాస్తు సమర్పించాం’ అని జాన్సన్‌ & జాన్సన్ ప్రతినిధి వెల్లడించారు. అలాగే తమ అంతర్జాతీయ సరఫరాలో హైదరబాద్‌కు చెందిన  బయోలాజికల్ ఇ సంస్థది ముఖ్యపాత్ర అని తెలిపారు. ఈ సంస్థ సహకారంతో సింగిల్‌ డోసు టీకాను తీసుకురావడానికి మార్గం సుగమమయ్యే ప్రక్రియలో ఇదొక మైలురాయని పేర్కొన్నారు.

ఫేజ్‌-3 క్లినికల్ ట్రయల్స్ ఆధారంగా జాన్సన్ సంస్థ ఈ దరఖాస్తును సమర్పించింది. ఈ టీకా 66 శాతం సమర్థంగా ఉన్నట్లు ఇదివరకే తేలింది. తీవ్ర కేసుల్లో మాత్రం 85 శాతం ప్రభావశీలతను చూపినట్లు సంస్థ వెల్లడింది. టీకా వేసిన 28 రోజుల తర్వాత కొవిడ్‌ నుంచి రక్షణ కల్పించడం ప్రారంభమవుతుంది. మహమ్మారిని అంతం చేయడంలో సహకరించేందుకు, టీకా లభ్యతను వేగవంతం చేసేందుకు.. భారత ప్రభుత్వంతో జరుపుతోన్న చర్చలు కొలిక్కి రావాలని ఎదురుచూస్తున్నట్లు సంస్థ తెలిపింది. మరోపక్క భారత్ వ్యాప్తంగా 3.18 కోట్ల కరోనా కేసులు వెలుగుచూడగా.. నాలుగు లక్షలకు పైగా మరణాలు సంభవించాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని