Kangana Ranaut: ‘మీ హితబోధ నాకు వద్దు’: గట్టిగా బదులిచ్చిన కంగనా రనౌత్‌

తనపై వస్తోన్న విమర్శలకు నటి కంగనా రనౌత్‌ (Kangana Ranaut) ఘాటుగా బదులిచ్చారు. 

Published : 06 Apr 2024 18:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్ నటి, మండి (Mandi) నియోజకవర్గ భాజపా అభ్యర్థి కంగనా రనౌత్‌ (Kangana Ranaut) తరచూ తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవల భారత తొలి ప్రధాని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని ఆమె పేర్కొనడం విమర్శలకు దారితీసింది. వాటిపై ఆమె స్పందించారు. 

ఇటీవల ఇంటర్వ్యూలో కంగన మాట్లాడుతూ.. ‘‘మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు తొలి ప్రధాని బోస్ ఎక్కడికి వెళ్లారు?’’ అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దేశం కోసం పోరాడిన ఆయన్ను దేశంలోకి అడుగుపెట్టనివ్వలేదని అన్నారు. ఆమె ప్రకటనపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి వారి మాటలు తేలిగ్గా తీసుకోవద్దని, వీరంతా ఎక్కడ చదువుకున్నారంటూ విపక్ష నేతలు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆమె విద్యాశాఖ మంత్రి అయితే పరిస్థితి ఏంటో..? అంటూ కామెంట్లు పెట్టారు. బోస్ గురించిన సమాచారంతో వచ్చిన న్యూస్‌ క్లిప్‌ను షేర్ చేసి స్పందించారు.

‘‘నాకు జ్ఞానాన్ని ఇవ్వడానికి ప్రయత్నించినవారంతా ఈ సమాచారాన్ని చదవండి. నాకు చెప్పేవారంతా ఒక విషయం తెలుసుకోవాలి. నేను ఎమర్జెన్సీ చిత్రాన్ని డైరెక్ట్ చేశాను. నటించాను. కథ అందించాను. అది పూర్తిగా గాంధీ కుటుంబం చుట్టూ తిరుగుతుంది. దయచేసి నాకు హితబోధలు చేయకండి’’ అని కౌంటర్ ఇచ్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని