Life imprisonment: కోతికి జీవిత ఖైదు.. ఐదేళ్ల శిక్ష పూర్తి

మనిషికి జీవిత ఖైదు విధించడం మనకు తెలుసు.. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌ కాన్పుర్‌లోని ఓ కోతి కూడా ఇలాంటి శిక్షనే అనుభవిస్తోంది.

Updated : 26 Nov 2022 06:59 IST

మనిషికి జీవిత ఖైదు విధించడం మనకు తెలుసు.. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌ కాన్పుర్‌లోని ఓ కోతి కూడా ఇలాంటి శిక్షనే అనుభవిస్తోంది. మీర్జాపుర్‌లో కాలియా అనే పేరు గల కోతి.. ఓ మాంత్రికుడి వద్ద మద్యం, మాంసాహారానికి అలవాటుపడింది. కొన్నాళ్ల క్రితం ఆ వ్యక్తి మరణించాడు. దాని ఆలనా పాలనా చూసేవారు లేకపోవడంతో ఆ వానరం విచక్షణ రహితంగా పురుషులు, మహిళలపై దాడికి దిగేది. మద్యం దుకాణాల వద్ద తాగుబోతుల నుంచి మందు సీసాలను ఎత్తుకుపోయి తాగేది. ఇలా 250 మందిపై దాడి చేసింది. దీంతో 2017లో స్థానికుల ఫిర్యాదుతో.. అతికష్టం మీద అటవీ అధికారులు వానరాన్ని బంధించారు. అప్పటి నుంచి జూలో బందీగా ఉంచి మానసిక వైద్యం అందించారు. ఐదేళ్లుగా శిక్ష అనుభవించినా కోతి ప్రవర్తనలో ఎటువంటి మార్పులేదు. దీంతో దాన్ని జీవితాంతం జూలోనే బందీగా ఉంచనున్నట్లు కాన్పుర్‌ జూ వైద్యుడు నాజర్‌ పేర్కొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని