Modi: శిర్డీ సాయిబాబాను సందర్శించుకున్న ప్రధాని మోదీ

మహారాష్ట్రలో ప్రధాని మోదీ(Modi) పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. రైతులకు లబ్ధి చేకూర్చే పథకాన్ని ఆవిష్కరించారు. 

Published : 26 Oct 2023 17:10 IST

ముంబయి: ప్రధాని నరేంద్రమోదీ(Modi)గురువారం మహారాష్ట్ర(Maharashtra)లో పర్యటించారు. ప్రసిద్ధ శిర్డీ సాయిబాబా మందిరంలో పూజలు నిర్వహించారు. ఆలయం వద్ద దర్శన్‌ క్యూ కాంప్లెక్స్‌ను ఆరంభించారు. ఈ పర్యటనలో ఆయన వెంట మహారాష్ట్ర గవర్నర్‌ రమేశ్‌ బైస్‌, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ ఉన్నారు.

ఈ సందర్భంగా అహ్మద్‌నగర్‌ జిల్లాలోని నిల్వండే డ్యామ్‌కు జల పూజ చేశారు. ఆ తర్వాత డ్యామ్ ఎడమకాలువను ప్రారంభించారు. 85 కి.మీ. మేర పొడవైన ఈ కాలువ వల్ల 182 గ్రామాలు లబ్ధి పొందనున్నాయి. అలాగే ‘నమో షెత్కారీ మహాసన్మాన్‌ నిధి యోజన’ను ఆవిష్కరించారు. ఈ పథకం వల్ల మహారాష్ట్రలో 86 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు. వైద్య, రవాణా, ఇంధనం.. ఇలా పలు రంగాలకు సంబంధించి రూ. 7,500 కోట్ల విలువైన ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపన చేశారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వ కేటాయింపులు పెరుగుతున్నాయని ఈ సందర్భంగా ప్రధాని వెల్లడించారు.

షాంఘై సదస్సులో ‘ఆషికీ 2’ పాట.. వీడియో వైరల్‌

మహారాష్ట్ర పర్యటన అనంతరం మోదీ గోవా వెళ్తారు. అక్కడ 37వ జాతీయ క్రీడల్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత క్రీడాకారుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారని గోవా ప్రభుత్వం వెల్లడించింది. గోవా మొదటిసారి జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇస్తోంది. ఈ క్రీడలు అక్టోబర్ 26 నుంచి నవంబర్ 9 వరకు జరగనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని