PM Modi: మళ్లీ పెరుగుతున్న కొవిడ్‌ కేసులు.. కాసేపట్లో ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష

Corona situation: కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టనున్నారు.

Updated : 22 Mar 2023 15:49 IST

దిల్లీ: దేశంలో కరోనా కేసులు(Corona cases) మళ్లీ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.  కరోనా పరిస్థితి, ప్రజా ఆరోగ్యశాఖ సన్నద్ధతపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఈ సాయంత్రం 4.30గంటలకు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.  ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.  కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం గడిచిన 24గంటల వ్యవధిలోనే 1,134 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం క్రియాశీల కేసుల సంఖ్య 7,026కి చేరింది. 

నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 1,03,831 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 1,134 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. అలాగే, తాజాగా కరోనా కారణంగా ఛత్తీస్‌గఢ్‌, దిల్లీ, గుజరాత్‌, మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందడంతో ఇప్పటివరకు కొవిడ్‌ బారిన పడి ప్రాణాలు విడిచినవారి సంఖ్య 5,30,813కి చేరినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 95.05 కోట్ల మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా..  4,46,98,118మందిలో వైరస్‌ ఉన్నట్టు తేలింది. నిన్న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 662మంది కోలుకోవడంతో మొత్తంగా రికవరీ అయినవారి సంఖ్య 4,41,60,279కి (రికవరీ రేటు 98.79శాతం) చేరింది. అలాగే, రోజువారీ పాజిటివిటీ రేటు 1.09%గా ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 0.98%గా ఉంది.  మరణాల రేటు 1.19శాతంగా ఉంది. కేంద్ర ఆరోగ్యశాఖ వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం ఇప్పటివరకు 220.65కోట్ల డోసుల కొవిడ్‌ టీకాను పంపిణీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని