Hamas: దిల్లీలో మాయమైన క్రిప్టో.. హమాస్‌ దగ్గర తేలి..!

భారత్‌లో అపహరించిన క్రిప్టో కరెన్సీలు కూడా హమాస్‌కు అందుతున్నాయి. గతేడాది పోలీసులు ఛేదించిన ఓ కేసులో ఈ విషయం బయటపడింది. వివిధ వాలెట్ల నుంచి ఇవి అక్కడి చేరినట్లు తేలింది. 

Updated : 11 Oct 2023 16:27 IST

ఇంటర్నెట్‌డెస్క్: పాలస్తీనా ఉగ్ర సంస్థ హమాస్‌కు ప్రపంచ వ్యాప్తంగా వివిధ అక్రమ మార్గాల్లో నిధులు అందుతున్నాయి. ఈ క్రమంలో భారత్‌ నుంచి కూడా అక్రమంగా సొమ్ము చేరినట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన క్రిప్టోకరెన్సీల దొంగతనం కేసును 2022లో దిల్లీ పోలీసులు ఛేదించారు. తాజాగా ఈ విషయం మరోసారి వార్తల్లో నిలిచింది. హమాస్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం ఒక కారణం కాగా.. తాజాగా మళ్లీ క్రిప్టోల రూపంలో హమాస్‌ డబ్బు కోరుతున్నట్లు ఇజ్రాయెల్‌ అధికారులు వెల్లడించడం రెండో కారణం. 

2022లో దిల్లీలో ఓ వ్యక్తి క్రిప్టో కరెన్సీ వాలెట్‌ నుంచి సొమ్ము మాయమైంది. దీనిపై కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి.. సైబర్‌ సెల్‌కు బదిలీ చేశారు. అధికారులు దర్యాప్తు చేయగా.. ఆ సొమ్ము హమాస్‌ ఉగ్రసంస్థలోని అల్‌ కస్సమ్‌ బ్రిగేడ్‌కు చేరినట్లు తేలింది. ఇది హమాస్‌ మిలటరీ వింగ్‌. ఈ సొమ్ము ఈజిప్ట్‌లోని అహ్మద్‌ మర్జూక్‌, పాలస్తీనాలోని అహ్మద్‌ షఫీకి చేరాయి. ఈ వాలెట్లను గాజా నుంచి ఆపరేట్‌ చేస్తున్నట్లు గుర్తించారు. 

మార్చి.. ‘ఏమార్చి!’

మరికొన్ని నిధులు మహమ్మద్‌ నసీర్‌ ఇబ్రహీం అబ్దుల్లా ఖాతాకు చేరినట్లు గుర్తించగా.. ఇజ్రాయెల్‌ వీటిని సీజ్‌ చేసింది. వివిధ ప్రైవేట్‌ వాలెట్ల నుంచి హమాస్‌కు నిధులు చేరుతున్నట్లు గుర్తించారు. తాజాగా హమాస్‌ క్రిప్టోల రూపంలో నిధుల సేకరణ మొదలుపెట్టడంతో ఈ విషయం తెరపైకి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని