Parboiled rice: ఇకపై బాయిల్డ్‌ రైస్‌ కొనం.. తేల్చి చెప్పిన కేంద్రం

పార్‌ బాయిల్డ్‌ బియ్యం తీసుకోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ధాన్యం సేకరణపై కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ వివరాలు వెల్లడించింది. ప్రస్తుతం రబీ పంట సీజన్‌ ఇంకా ప్రారంభం కాలేదని.. రబీ ధాన్యం సేకరణపై రాష్ట్రాలతో చర్చించాల్సి ఉందని పేర్కొంది...

Updated : 18 Nov 2021 16:31 IST

దిల్లీ: పార్‌ బాయిల్డ్‌ బియ్యం తీసుకోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ధాన్యం సేకరణపై కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ వివరాలు వెల్లడించింది. ప్రస్తుతం రబీ పంట సీజన్‌ ఇంకా ప్రారంభం కాలేదని.. రబీ ధాన్యం సేకరణపై రాష్ట్రాలతో చర్చించాల్సి ఉందని పేర్కొంది. వచ్చే ఏడాదిలో బియ్యం ఎంత సేకరించాలో నిర్ణయిస్తామని తెలిపింది. ‘‘ఒక్కో రాష్ట్రం నుంచి డిమాండ్‌ ఒక్కో విధంగా ఉంది. గత నిర్ణయాల ప్రకారమే ఇప్పటివరకు బాయిల్డ్‌ రైస్‌ సేకరించాం. ఇకపై బాయిల్డ్‌ రైస్‌ కొనం. వరి, గోధుమ తక్కువగా పండించాలని కోరుతున్నాం. ప్రస్తుతం దేశంలో సరిపడా బియ్యం, గోధుమ నిల్వలు ఉన్నాయి. ఇంకా నిల్వ చేసే పరిస్థితి లేదు. దేశీయ అవసరాలు, ఎగుమతుల మేరకు నిర్ణయం తీసుకుంటాం. ఎగుమతి అవకాశాలను పరిగణనలోకి తీసుకుంటున్నాం. ఎగుమతులకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచిస్తున్నాం. నూనె, పప్పు ధాన్యాల పంటలు ఎక్కువగా పండించాలి. అన్ని రాష్ట్రాలకు ఇదే సూచిస్తున్నాం. రాష్ట్రాలు సేకరించగలిగేంత వరకే పరిమితం కావాలి. గతంలో తెలంగాణ నుంచి 60 లక్షల టన్నుల ధాన్యం, 40 లక్షల టన్నుల బియ్యం సేకరించాలని నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్రాలతో చర్చలు జరిపిన తర్వాతే ధాన్యం, బియ్యం సేకరణపై నిర్ణయం తీసుకుంటాం’’ అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని