Supersonic Missile: దీర్ఘశ్రేణి సూపర్‌సోనిక్‌ క్షిపణి ‘స్మార్ట్‌’ ప్రయోగం సక్సెస్‌

భారత నేవీ కోసం రూపొందించిన సూపర్ సోనిక్  మిస్సైల్ అసిస్టెడ్ టార్ఫిడో వ్యవస్థ (స్మార్ట్‌)ను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్​డీఓ) విజయవంతంగా పరీక్షించింది......

Updated : 12 Aug 2022 14:05 IST

దిల్లీ: భారత నేవీ కోసం రూపొందించిన సూపర్ సోనిక్  మిస్సైల్ అసిస్టెడ్ టార్పిడో వ్యవస్థ (స్మార్ట్‌)ను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్​డీఓ) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్‌ తీరం నుంచి ఈ క్షిపణి పరీక్షను అధికారులు చేపట్టారు. నేవీ కోసం ఆధునాతన ఆయుధ వ్యవస్థను రూపొందిస్తున్న డీఆర్​డీఓ.. తాజాగా ‘స్మార్ట్​’ పేరుతో సూపర్‌సోనిక్‌ క్షిపణిని తయారుచేసి విజయవంతంగా పరీక్షించింది.

భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా జలాంతర్గాముల్లో పైనుంచి టార్పిడోలను ప్రయోగించేందుకు వీలుగా ఈ క్షిపణి వ్యవస్థను రూపొందించారు. ఈ పరీక్షలో.. నిర్దేశించిన లక్ష్యాన్ని క్షిపణి చేరుకోగలిగిందని డీఆర్​డీఓ అధికారులు వెల్లడించారు. శుత్రదేశాల జలాంతర్గాముల ఉనికిని ముందుగానే పసిగట్టి.. వాటిపై ఈ సూపర్‌సోనిక్‌ క్షిపణులను ప్రయోగిస్తుందని తెలిపారు. భారత నేవీ కోసం ఈ క్షిపణి తయారు చేసినట్లు డీఆర్​డీఓ పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని