Tillu Tajpuriya murder: గ్యాంగ్‌స్టర్‌ హత్య.. జైల్లో ఆ నాలుగు కత్తులు ఎక్కడివి..?

గ్యాంగ్‌స్టర్‌ టిల్లు తాజ్‌పురియా (Tillu Tajpuriya) హత్య (Murder) నేపథ్యంలో తిహాడ్‌ జైలు సిబ్బందిపై దిల్లీ హైకోర్టు సీరియస్‌ అయ్యింది. దాడికి అడ్డుకునేందుకు అధికారులు, సిబ్బంది ఎందుకు ప్రయత్నించలేదని ప్రశ్నించింది.

Updated : 08 May 2023 14:57 IST

తిహాడ్‌ జైలు అధికారులకు కోర్టు ప్రశ్న

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని తిహాడ్‌ జైల్లో (Tihar Jail) గ్యాంగ్‌స్టర్‌ టిల్లు తాజ్‌పురియా (Tillu Tajpuriya) హత్య తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో విచారణ చేపట్టిన దిల్లీ హైకోర్టు.. జైలు అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించింది. దాడికి అడ్డుకునేందుకు జైలు సిబ్బంది ఎందుకు ప్రయత్నించలేదని ప్రశ్నించింది. జైల్లోకి నాలుగు కత్తులు ఎలా వచ్చాయని అడిగింది. (Gangster Tillu Tajpuriya Murder)

తిహాడ్‌ జైలులో మే 2వ తేదీన తేజ్‌పురియాను తోటి ఖైదీలు, మరో గ్యాంగ్‌స్టర్‌ గోగి ముఠా సభ్యులు అతడిని దారుణంగా పొడిచి చంపిన విషయం తెలిసిందే. ఈ దాడికి సంబంధించిన దిగ్భ్రాంతికర దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్‌ అవ్వగా.. ఆ వీడియోలు ఇటీవల సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టాయి. దాడిలో తీవ్రంగా గాయపడిన టిల్లు (Tillu Tajpuriya)ను జైలు సిబ్బంది తీసుకువస్తుండగా.. నిందితులు మరోసారి అతడిపై దాడి చేశారు. ఆ సమయంలో జైలు సిబ్బంది వారిని అడ్డుకోకపోవడం ఆ వీడియోల్లో కన్పించింది. దీనిపై సిబ్బంది విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ఈ క్రమంలోనే టిల్లు (Tillu Tajpuriya) హత్యపై అతడి తండ్రి, సోదరుడు హైకోర్టు (Delhi High Court)లో పిటిషన్ దాఖలు చేశారు. ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని వారు అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన దిల్లీ హైకోర్టు.. జైలు అధికారులు, సిబ్బంది తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ‘‘సీసీటీవీ దృశ్యాలను మేం పరిశీలించాం. ఆ వీడియో జైల్లోనిదే అయితే.. దాడికి అడ్డుకునేందుకు పోలీసులు ఎందుకు ప్రయత్నించలేదు..? హత్య జరగకుండా ఎందుకు చర్యలు తీసుకోలేదు..? ఇలాంటి ప్రవర్తన ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు’’ అని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తంచేసింది.

ఇదీ చదవండి: పోలీసుల కళ్ల ముందే దాడి.. 90 కత్తిపోట్లు

ఇక, దాడి తర్వాత జైల్లో లభ్యమైన నాలుగు కత్తులు ఎక్కడి నుంచి వచ్చాయని కోర్టు ప్రశ్నించింది. దానిపై అఫిడవిట్‌ సమర్పించాలని తిహాడ్‌ జైలు అధికారులను ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను మే 25వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజున జైలు సూపరిండెంట్‌ కోర్టుకు హాజరుకావాలని స్పష్టం చేసింది. అంతేగాక, టిల్లు తండ్రి, సోదరుడికి భద్రత కల్పించాలని పోలీసులను (Delhi Police) ఆదేశించింది. టిల్లు హత్య నేపథ్యంలో పోలీసులపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన అధికారులు.. హత్య సమయంలో తిహాడ్‌ జైల్లో విధులు నిర్వర్తిస్తున్న ఏడుగురు తమిళనాడు స్పెషల్‌ పోలీసు సిబ్బందిని సస్పెండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు