Mahua Moitra: అక్టోబరు 31న విచారణకు రాలేను.. లోక్‌సభ కమిటీకి మహువా మెయిత్రా లేఖ

లోక్‌సభ నైతిక విలువల కమిటీ విచారణకు అక్టోబరు 31న హాజరుకాలేనని తృణమూల్‌ ఎంపీ మహువా మొయిత్రా తెలిపారు. ఈ మేరకు ఆమె లోక్‌సభ కమిటీ ఛైర్మన్‌కు లేఖ రాశారు.

Published : 27 Oct 2023 16:54 IST

దిల్లీ/కోల్‌కతా: డబ్బులు తీసుకొని పార్లమెంటులో ప్రశ్నలు అడిగారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్‌ కాంగ్రెస్ (TMC) ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra) లోక్‌సభ నైతిక విలువల కమిటీకి లేఖ రాశారు. కమిటీ విచారణకు హాజరయ్యేందుకు తనకు మరింత సమయం కావాలని లేఖలో కోరారు. ఈ మేరకు లోక్‌సభ నైతిక విలువల కమిటీ ఛైర్మన్‌కు రాసిన లేఖను మహువా సోషల్‌ మీడియాలో షేర్ చేశారు.

తన నియోజకవర్గంలో అక్టోబరు 30 నుంచి నవంబరు 4 వరకు ముందుగా షెడ్యూల్‌ చేసిన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని, అందువల్ల అక్టోబరు 31న కమిటీ విచారణకు హాజరుకాలేనని మొయిత్రా లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా గతంలో భాజపా ఎంపీ రమేష్‌ భిధూరీ విజ్ఞప్తి మేరకు లోక్‌సభ ప్రివిలేజ్‌ కమిటీ విచారణ తేదీని మార్పు చేసిన విషయాన్ని ఆమె లేఖలో ప్రస్తావించారు. అదే విధంగా తనకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. 

రేషన్‌ స్కామ్‌లో.. బెంగాల్‌ మంత్రి అరెస్టు

‘‘ఎథిక్స్ కమిటీ ఛైర్మన్‌ నాకు సమన్లు ఈ-మెయిల్‌ చేయడానికి ముందే టీవీల్లో వాటిని ప్రసారం చేశారు. నాపై నమోదైన ఫిర్యాదులు, సుమోటో అఫిడవిట్‌లు మీడియా సంస్థలకు అందాయి. నా నియోజకవర్గంలో ముందుగా షెడ్యూల్‌ చేసిన కార్యక్రమాలు నవంబరు 4న ముగిసిన వెంటనే విచారణకు హాజరవుతాను’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే వ్యాపారవేత్త హీరానందానీని కూడా కమిటీ విచారణకు పిలవాలని, ఆయన నుంచి స్వీకరించినట్లుగా చెబుతున్న బహుమతుల వివరాలను కమిటీకి సమర్పించాలని లేఖలో కోరారు.

మరోవైపు మొయిత్రాపై ఆరోపణలు చేసిన భాజపా నేత నిషికాంత్‌ దూబే, న్యాయవాది జై అనంత్‌ దేహాద్రాయ్‌లు గురువారం కమిటీ ముందు హాజరై.. తమ వాంగ్మూలాలను నమోదు చేశారు. కమిటీ సభ్యుల ముందు నిషికాంత్‌ దూబే మాట్లాడుతూ.. మొయిత్రాపై సాక్ష్యాలు స్పష్టంగా ఉన్నాయని.. ఆమె లోక్‌సభ సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు