
Uttar Pradesh: కుమార్తెలకు పెళ్లయినా కారుణ్య నియామకాలకు అర్హులే..!
యూపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
లఖ్నవూ: కారుణ్య నియామకాలకు సంబంధించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు తమ సర్వీసులో ఉన్నప్పుడు మరణిస్తే కారుణ్య నియామకాల కింద ఆ ఉద్యోగాలను పొందేందుకు వివాహిత కుమార్తెలు కూడా అర్హులేనని వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర నియామకాల శాఖ తీసుకున్న ఈ నిర్ణయానికి యూపీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
ఇప్పటివరకు సర్వీసులో ఉద్యోగి మరణిస్తే కారుణ్య నియామకాల ద్వారా ఆ వ్యక్తి ఉద్యోగాన్ని భార్య, కుమారుడు లేదా అవివాహత అయిన కుమార్తెలకు ఇచ్చేవారు. కుమార్తెకు వివాహమైతే ఈ నియామకాలకు అనర్హులుగా పరిగణించేవారు. అయితే దీని వల్ల ఒకే కుమార్తె ఉన్న కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే యూపీ ప్రభుత్వం ఈ నిబంధనలను సవరిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది.
ఇటీవల అలహాబాద్ హైకోర్టు కూడా ఓ కేసు విచారణ సందర్భంగా ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. ప్రయాగ్రాజ్ జిల్లాకు చెందిన మంజుల శ్రీవాస్తవ అనే మహిళ తండ్రి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరణించారు. ఆయన ఉద్యోగాన్ని మంజులకు ఇచ్చేందుకు అధికారులు నిరాకరించడంతో ఆమె కోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్పై విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు.. కుటుంబంలో వివాహిత కుమార్తెలను కలపకపోవడం రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొంది. కుటుంబం అనే పదంలో పెళ్లయిన కుమార్తెను కూడా చేర్చేలా కేంద్రం చర్యలు చేపట్టాలని సూచించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.