Yogi Adityanath: ‘ఉగ్రవాదులకు బిర్యానీ పెట్టి పోషించారు’: కాంగ్రెస్‌పై యోగి విమర్శలు

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతోన్న తరుణంలో అన్ని పార్టీలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. ఈ సందర్భంగా భాజపా స్టార్‌ క్యాంపెయినర్ యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath) ప్రధాని మోదీ విధానాలను కొనియాడారు. 

Updated : 08 Apr 2024 11:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉగ్ర అనుమానితుల పట్ల కాంగ్రెస్ (Congress) పార్టీ మెతక వైఖరి అనుసరించిందని ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ పాలనలో పేదలు ఆకలితో అలమటించారని.. ఉగ్రవాదులకు మాత్రం బిర్యానీ పెట్టి పోషించారని దుయ్యబట్టారు. నరేంద్రమోదీ (Modi) ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలుగా 80 కోట్ల మంది పౌరులకు ఉచిత రేషన్ అందిస్తోందని గుర్తుచేశారు. రాజస్థాన్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు.

‘‘కాంగ్రెస్‌ పాలనలో ఎలాంటి విధానాలు లేవు. కీలక నిర్ణయాలు లేవు. భాజపా ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకు కొదవలేదు. ఈ దేశానికి హస్తం పార్టీ అతి పెద్ద సమస్య. మోదీ నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా భారత దేశ ప్రతిష్ఠ పెరిగింది. తీవ్రవాదం, ఉగ్రవాదం ముగిసిపోయాయి. జమ్మూకశ్మీర్‌పై కాంగ్రెస్‌ రుద్దిన ఆర్టికల్ 370ని శాశ్వతంగా రద్దు చేశాం’’ అని వెల్లడించారు. అలాగే అయోధ్య రామమందిర నిర్మాణం గురించి ప్రస్తావించారు. కరోనా సమయంలో కాంగ్రెస్‌తో సహా పలు పార్టీలు కనిపించకుండా పోతే.. మోదీ మాత్రం తన గురించి పట్టించుకోకుండా అవిశ్రాంతంగా కృషి చేశారని కొనియాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని